ది గ్రేట్‌ ప్రీ వెడ్డింగ్‌ షో

The Great Pre Wedding Showవైవిధ్యమైన పాత్రలు, సినిమాలతో వెర్సటైల్‌ యాక్టర్‌గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు తిరవీర్‌. ఆయన హీరోగా కొత్త సినిమా ‘ది గ్రేట్‌ ప్రీ వెడ్డింగ్‌ షో’ హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. బై 7పి.ఎంప్రొడక్షన్స్‌, పప్పెట్‌ షో ప్రొడక్షన్స్‌ బ్యానర్స్‌పై రాహుల్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో సందీప్‌ అగరం, అష్మితా రెడ్డి ఈ మూవీని నిర్మిస్తున్నారు. ‘కమిటీ కుర్రోళ్ళు’ ఫేమ్‌ టీనా శ్రావ్య కథానాయిక. ముహూర్తం సన్నివేశానికి రానా దగ్గుబాటి క్లాప్‌ కొట్టగా, సందీప్‌ అగరం కెమెరా స్విచ్‌ ఆన్‌ చేశారు. రాహుల్‌ శ్రీనివాస్‌ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా నిర్మాతలు సందీప్‌ అగరం, అష్మితా రెడ్డి మాట్లాడుతూ, ‘మా సినిమాను సపోర్ట్‌ చేయటానికి వచ్చిన రానాకి, ఇతర సినీ పెద్దలు, ప్రముఖులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలలు. కామెడీ డ్రామా జోనర్‌లో సినిమాను రూపొందిస్తున్నాం. దర్శకుడు రాహుల్‌ శ్రీనివాస్‌ కొత్త పాయింట్‌తో సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ కథని అంగీకరించి, మా బ్యానర్‌లో నటిస్తున్న హీరో తిరువీర్‌కి థ్యాంక్స్‌’ అని అన్నారు. ‘ఈ సినిమా కామెడీ డ్రామా మూవీగా అలరించనుంది. నవంబర్‌ 7 నుంచి ఎస్‌.కోట, వైజాగ్‌ ప్రాంతాల్లో చిత్రీకరణను జరుపబోతున్నాం. అవకాశం ఇచ్చిన హీరో తిరువీర్‌కి, నిర్మాతలు సందీప్‌ అగరం, అష్మితారెడ్డికి ధన్యవాదాలు’ అని దర్శకుడు రాహుల్‌ శ్రీనివాస్‌ చెప్పారు. తిరువీర్‌, టీనా శ్రావ్య, రోహన్‌ రారు, నరేంద్ర తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి రచన-దర్శకత్వం: రాహుల్‌ శ్రీనివాస్‌, కో ప్రొడ్యూసర్‌: కల్పనా రావ్‌, సినిమాటోగ్రఫీ:ఎస్‌.సోమశేఖర్‌, మ్యూజిక్‌: కళ్యాణ్‌ నాయక్‌, ఎడిటర్‌: నరేష్‌ అడుప, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: పజ్ఞ్రరు కొనిగారి, ప్రొడక్షన్‌ డిజైనర్‌: ఫణి తేజ ముసి.