బీసీలకు పెరుగుతున్న ఆదరణ..

నవతెలంగాణ – భువనగిరి

 యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి నియోజకవర్గంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలో బీసీల ఓట్లను ఆకట్టుకోవడానికి పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా బీసీ నాయకత్వానికి ఆదరిస్తూ దగ్గరికి తీసుకుంటున్నారు. నియోజకవర్గంలో ముదిరాజు,గౌడ, పద్మశాలి, యాదవ, మున్నూరు కాపు ఓటర్లు అత్యధికంగా ఉన్నాఉన్నారు. బీసీలలోని ఈ నాలుగు కులాలను మచ్చిక చేసుకోవడానికి వ్యూహాలు పన్నుతున్నారు. వ్యాపార వాణిజ్య వర్గాలను బీసీ కులాలను బిఆర్ఎస్ వైపు తిప్పే విధంగా జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్ డాక్టర్ జడల అమరేందర్ గౌడ్, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు కొలుపుల అమరేందర్ ప్రత్యేకంగా అన్ని మండలాలలో పట్టణ కేంద్రంలో పర్యటిస్తూ సమన్వయం చేస్తున్నారు.  ముదిరాజులను బిఆర్ఎస్ వైపు మొగ్గు చూపే విధంగా ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షులు కొలుపుల హరినాద్, మున్సిపల్ మాజీ చైర్మన్ పెంట నరసింహ భువనగిరి పట్టణానికి చెందిన ఇట్టబోయిన గోపాల్ తోపాటు ఇతర ముదిరాజ్ పెద్దలను ఇప్పటికే నియోజకవర్గం అంతా పర్యటించేటట్లు చేశారు. మత్స కార్మిక సంఘాలను కలిసి వరాలు కురిపిస్తున్నారు. గౌడ సామాజిక వర్గంలోని అతికం లక్ష్మీనారాయణ, నల్ల మాస్ రమేష్ గౌడ్ తోపాటు ఆ సామాజిక వర్గం నాయకులకు ఇప్పటికే మాట్లాడి వారిని పురమాయిస్తున్నారు . పద్మశాలి సంఘం యాదవ సంఘాలు ఇదే తరహాలో   వారి వారి ఓట్లు రాబట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. భువనగిరి మండలం సీనియర్ కాంగ్రెస్ నాయకులు గోదా శ్రీనివాసు కాంగ్రెస్కు గుడ్ బాయ్ చెప్పి బీఆర్ఎస్ లో చేరడం అందులో భాగమే. ఇదే తరహలో కాంగ్రెస్ మండలాల వారీగా ఆయా కులాల సంబంధించిన నాయకులను ప్రచారంలోకి దింపారు.   పట్టణానికి చెందిన పద్మశాలి యాదవ సంఘానికి చెందిన నాయకులను కాంగ్రెస్ పార్టీ ఆకట్టుకొని చేర్చుకుంది. మరింత మంది కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.  చేతులు మారుతున్న నగదు. ఇతర పార్టీల నాయకులు కుల సంఘ నాయకులను వారి అనుచరులను చేర్చుకోవడానికి రాష్ట్రంలోనే భువనగిరి నియోజకవర్గంలో నగదు చేతులు మారుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.   ఆయా మండలాలు వారిగా కావాల్సిన నగదును గోప్యంగా పెట్టినట్లు సమాచారం.  ప్రభుత్వపరంగా రావాల్సిన కుల భవనాలకు డబ్బులు కేటాయిస్తానని హామీలు పెద్ద ఎత్తున ఇస్తున్నారు. ఇరు పార్టీల మధ్య బీసీల పట్ల ఆసక్తి వ్యక్తిగతంగా నగదులు తీసుకుంటారో లేక వారి కులాల వారిగా అభివృద్ధికి శ్రీకారం చుడతారు చూడాలి.