వీసీని సన్మానించిన గెస్ట్ ఉద్యోగులు..

The guest employees honored the VC.నవతెలంగాణ – ముధోల్
బాసర ట్రిపుల్ ఐటీ ఇంచార్జి వీసీ గోవర్థన్ నూతనంగా బాధ్యతలు చేపట్టడంతో ట్రిపుల్ ఐటీ గెస్ట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం వీసీని  కలిసి  ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయనకు అమ్మవారి ఫోటోను అందజేశారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడారు. అందరి సహకారంతో యూనివర్సిటీ అభివృద్ధి కోసం పని చేయాలని సూచించారు. చక్కని వాతావరణంలో ఉన్నటువంటి ట్రిపుల్ ఐటీ అభివృద్ధిలో పాలుపంచుకోవాలని అన్నారు . ఈ కార్యక్రమంలో గెస్ట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ సభ్యులు ముత్యం, బైరు రాజేష్, కృష్ణ, నవీన్, రవి, సోఫియా, ప్రసూన తదితరులు పాల్గొన్నారు.