– అడ ప్రాజెక్టు గేట్ల ఎత్తివేత
నవతెలంగాణ-ఆసిఫాబాద్
రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో మండలంలోని గుండి గ్రామస్తులకు కష్టాలు మొదలయ్యాయి. వర్షం కొంత పెరగడంతో ఆడ ప్రాజెక్టులు గేట్లు ఎత్తి దిగువకు నీళ్లు వదులుతున్న నేపథ్యంలో గుండి వద్ద ప్రవాహం పెరిగింది. దీంతో గ్రామస్తులు మూడు కిలోమీటర్ల దూరం ఉన్న జిల్లా కేంద్రానికి రావడానికి వాంకిడి మీదుగా 30 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు అధికారులు స్పందించి వాగుపై బ్రిడ్జి పూర్తిచేసిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
అడ ప్రాజెక్టు గేట్ల ఎత్తివేత
రెండు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆసిఫాబాద్ మండలంలోని అడ ప్రాజెక్టు రెండు గేట్లు ఎత్తి 652 క్యూసెక్కుల నీటిని మంగళవారం ఉదయం నుండి బయటికి వదులుతున్న అధికారులు వరద ప్రవాహం పెరగడంతో గేట్లను ఒక మీటర్ పైకి ఎత్తి 1352 క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతున్నారు. మండలంలోని మరో ప్రాజెక్టు వట్టివాగు కూడా సామర్థ్యం కంటే ఎక్కువగా నీరు వస్తున్న నేపథ్యంలో ఇదే వర్షపాతం నమోదైతే గురువారం గేట్లు ఎత్తే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల ప్రజలను జిల్లా అధికారులు అప్రమత్తం చేయగా వాతావరణ శాఖ ఐదురోజుల వర్ష సూచన నేపథ్యంలో వాగులు పొంగిపొర్లె ప్రమాదం ఉంది. జిల్లాలో డిజాస్టర్ మేనేజ్మెంట్ సిబ్బందిని ప్రత్యేకంగా 30 మందిని నియమించినట్లు ఎస్పీ డీవీ శ్రీనివాసరావు తెలిపారు.