
– బీఆర్ఎస్ కు ఓటేస్తే బీజేపీకి వేసినట్లే
– అవినీతికి కేరాఫ్ అడ్రస్ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
– కాంగ్రెస్ 6 గ్యారంటీలతో అధికారంలోకి రావడం ఖాయం
– మునుగోడు గడ్డ రాజగోపాల్ రెడ్డి అడ్డా అనే విధంగా తీర్పు ఉండబోతుంది
– కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు వేమిరెడ్డి జితేందర్ రెడ్డి
నవతెలంగాణ మునుగోడు: హస్తం పేద ప్రజల నేస్తం అనే విధంగా కాంగ్రెస్ హయాంలో పేద ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలను పెట్టి సంక్షేమ పథకాలు అందించిందని కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు వేమిరెడ్డి జితేందర్ రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని చల్మేడ గ్రామంలో కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీలపై గడపగడప తిరుగుతూ ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా పేద ప్రజల నడ్డి విచ్చే విధంగా ధరలను పెంచిన కేంద్రంలో , రాష్ట్రంలో పాలించిన బీజేపీ బీఆర్‌ఎస్ కు ఎన్నికలలో ఓటు వేసి మోసపోవద్దని అన్నారు. బీజేపీకి ఓటు వేస్తే బీఆర్ఎస్ కి వేసినట్టే అని ఆ రెండు పార్టీలు రాష్ట్రంలో తిట్టుకుంటూ ఢిల్లీలో కలుసుకుంటున్నాయని పేర్కొన్నారు. గత పది సంవత్సరాలుగా అధికార పార్టీని అడ్డం పెట్టుకొని అవినీతికి పాల్పడిన కూసుకుంట ప్రభాకర్ రెడ్డి కావాలనా .. అర్ధరాత్రి ఆపద వచ్చిన ఆదుకునే ఆపద్బాంధవుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కావాలన ప్రజలే నిర్ణయించుకోవాలని అన్నారు . మునుగోడు నియోజకవర్గం లో ప్రతిపక్షంగా ఎమ్మెల్యే ఉంటే నిధులు ఎందుకు ఇవ్వరు అని ప్రశ్నించినందుకు అభివృద్ధికి అడ్డుపడిన బీఆర్‌ఎస్ కు బుద్ధి చెప్పేందుకు రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేస్తే మునుగోడు నియోజకవర్గానికి 570 కోట్ల నిధులు వచ్చినయి వాస్తవం కాదా అని ప్రశ్నించారు ..? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ని గెలిపించుకునేందుకు మునుగోడు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ధీమా వ్యక్తంచేశారు. కాంగ్రెస్ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలతో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని అన్నారు . మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్కు అత్యధిక మెజార్టీ వచ్చేందుకు ఈనెల 30న జరిగే ఎన్నికలలో చేయి గుర్తు పై ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కొంక శంకర్, పగిళ్ల శ్రీరాములు, నరసింహ, కొంక చంద్రయ్య, ఎస్ యాదయ్య, జి వెంకటయ్య, లాలయ్య, గాదెపాక శరత్, భగత్, లక్ష్మణ్, రాము తదితరులు ఉన్నారు.