చేతులు

చేతులు ముడుచుకొని
కూర్చుంటే ఏమొస్తుంది
రెండు చేతులెత్తి గాలిలో ఊపండి
నీ అస్తిత్వపు జేండాయై
రెపరెపలాడుతుంది
బియ్యంలోని రాళ్ళను తీసివేయి
పొలంలోని కలుపు మొక్కల్ని
పీకి పారవేయి
ఎదుటి దిక్కైనా నీ దిక్కైనా వేలెత్తి చూపుకోవాలి
లేదా బాణం గుర్తును చేసి
పచ్చని అడవికి దారిచూపాలి
చేతులతో గతాన్ని తవ్వి
అస్థిపంజరాల లేత బుగ్గలను నిమరండి
వర్తమానం మీద నిలబడి
దూసుకు వచ్చే క్షిపణులకు
అరచేతులను అడ్డంపెట్టండి
లేదా అరచేతులను బోర్లించి
శాంతి కపోతాలను చేసి
భవిష్యత్తులోకి ఎగురవేయండి
చేతులు అచేతనంగా ఉంటే
మతకళేబరం అనుకొని
రాబందులు వాలిపోతాయి
– పర్కపెల్లి యాదగిరి, 9299909516