
బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న పది ఏళ్లలో కానరాని కష్టాలు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి ఇప్పుడు గుర్తుకు రావడం విడ్డూరంగా ఉందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బోధిరే స్వామి అన్నారు. శనివారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పత్రిక సమావేశంలో స్వామి మాట్లాడుతూ శుక్రవారం బాల్కొండ టిఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి భీంగల్ పట్టణంలో రైతులు, రైతుల మద్దతు లేని ధర్నా నిర్వహించి కాంగ్రెస్ ప్రభుత్వం పై విమర్శలు చేయడం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. పదేళ్లు ప్రభుత్వంలో, ఐదేళ్లు మంత్రిగా ఉన్న ప్రశాంత్ రెడ్డి ఆనాడు రైతులు వడగండ్ల వానలతో పంటలను నష్టపోతు ఆర్థిక సమస్యలతో ఆత్మహత్య చేసుకుంటుంటే కనీసం బాధితుల ఇంటికి వెళ్లి పలకరించి ఒక్క రూపాయి కూడా నష్టపరిహారం అందించని ఆనాటి మంత్రి ఈరోజు రైతుల మీద కపట ప్రేమను నటిస్తూ మాట్లాడితే నియోజకవర్గ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. కాంగ్రెస్ పార్టీ చెప్పిన హామీలన్నిటిని తప్పకుండా నెరవేరుస్తుందని ఇప్పటికే నాలుగు గ్యారంటీలను 90 రోజుల్లో అమలు చేసిందని తెలిపారు ఎన్నికల కోడ్ వల్ల మిగతా హామీలను ప్రకటించలేకపోయిన, పార్లమెంట్ ఎన్నికల తర్వాత తప్పకుండా, రైతు రుణమాఫీ, రైతులకు 500 రూపాయల బోనస్ ఖరీఫ్ సీజన్లో తప్పకుండా అమలు చేస్తుందని తెలిపారు .రైతుల పక్షాన పోరాడుతమని చెప్పుకుంటున్న ఎమ్మెల్యే వర్షాకాలంలో కురిసిన వర్షాలకు బాల్కొండ నియోజకవర్గంలో ప్రాణాళిక లేకుండా నిర్మించిన నాసిరకం చెక్ డ్యాముల తెగిపోయి పంట పొలాలు ధ్వంసం అయినా ఇంతవరకు ఏ ఒక్క రైతుకు రూపాయి నష్టపరిహారం ఇప్పిచ్చిన దాఖలు లేవన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే మాట్లాడిన మాటలు అధికారం కోల్పోయి నిస్సహాయ స్థితిలో ఉన్న కొద్ది మంది కార్యకర్తలు ఎక్కడ చేజారిపోతారనే భయంతో తను ఆత్మస్థైర్యం కోల్పోయి, వారిలో ధైర్యాన్ని నింపడానికి, చేసిన ఒక విపల యత్నం అని అన్నారు, రానున్న ఎంపీ ఎలక్షన్లలో రాజకీయ లబ్ధి పొందే ఎందుకే ధర్నా నాటకం అని ప్రజలంతా గమనిస్తున్నారన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు జెజె నరసయ్య.డిసిసి డెలిగేట్ కుంట రమేష్.ఎస్టీ సెల్ అధ్యక్షులు గోపాల్ నాయక్.ఎస్సీ సెల్ అధ్యక్షులు అనంతరావు.యువజన కాంగ్రెస్ బాల్కొండ నియోజకవర్గ అధ్యక్షులు నాగేంద్ర.వాక మహేష్.సాయి బాబా. సురేష్.రహిమాన్.సీనియర్ నాయకులు బలరాం.గోపాల్ అంబాజీ.రవి.అజయ్.నాగరాజు తదితరులు పాల్గొన్నారు.