– చిట్టి ఉమేష్ పాదయాత్ర ప్రారంభిస్తూ ఎమ్మెల్యే జీఎంఆర్
నవతెలంగాణ-రామచంద్రాపురం
బీఆర్‌ఎస్ కార్యకర్తల సమిష్టి కృషి మూలంగానే పటాన్చెరు నియోజకవర్గంలో గులాబీ జెండా మూడోసారి రెపరెపలాడిందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహి పాల్‌రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే జిఎంఆర్ హ్యాట్రిక్ విజయం సాధించిన సందర్భంగా తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని ఉస్మాన్‌నగర్ బీఆర్‌ఎస్ నాయకులు చిట్టి ఉమేష్.. ఉస్మాన్ నగర్ హనుమాన్ దేవాలయం నుంచి చిలుకూరు బాలాజీ దేవాలయం వరకు చేపట్టిన పాదయాత్రను ఎమ్మెల్యే జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా హనుమాన్ దేవాల యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ లలితా సోమిరెడ్డి, వైస్ చైర్మన్ రాములు గౌడ్, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.