
భిక్కనూరు పట్టణ కేంద్రంలోని శ్రీరామ్ నగర్ కాలనీలో నీటి సమస్య పరిష్కరించాలని పంచాయతీ కార్యదర్శి మహేష్ గౌడ్ కు శుక్రవారం ఆర్టిఐ జిల్లా ప్రతినిధి రవీందర్ వినతి పత్రాన్ని అందజేశారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని పట్టణ కేంద్రంలో నీటి సమస్య పరిష్కారం కొరకు ముందస్తు చర్యలు తీసుకోవాలని, ప్రజలు నీటి ఇబ్బందులు లేకుండా చూడాలని వినతి పత్రంలో పేర్కొన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు నాగరాజు, పంచాయతీ సిబ్బంది ఉన్నారు.