అకాల వర్షం.. తగ్గిన భానుడి తాపం

నవతెలంగాణ – భగత్ నగర్
జిల్లాలో అకాల వర్షం కురిసింది. దీంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. కొద్ది రోజులుగా మండిపోతున్న ఎండలతో ఉక్కిరిబిక్కిరి అయిన జనం కాస్తా.. ఊపశమనం పొందారు. మంగళ వారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత కనిపించగా ఒక్కసారిగా వాతావరణం చల్లబడి గాలులు వీయడంతో జిల్లా వాసులు ఆనందం వ్యక్తం చేశారు. కాగా ధాన్యం కొనుగోలు పూర్తి కాకపోవడం, మామిడి వంటి సీజన్ పంటలు వర్షం ధాటికి దెబ్బ తినడంతో కరీంనగర్ పరిసర గ్రామ రైతుల్లో ఆందోళన నెలకొంది.