– సీపీఐ(ఎం) ములుగు జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకటరెడ్డి
నవతెలంగాణ-వాజేడు
తెలంగాణ సాయుధ పోరాట వారసులు కమ్యూ నిస్టులేనని సీపీఐ(ఎం) ములుగు జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకటరెడ్డి అన్నారు. వాజేడు మండలంలో గుడిసె వాసుల పోరాట కేంద్రంలో ఆదివారం తెలం గాణ సాయుధ పోరాట వార్షికోత్సవ సభ గుగ్గిల దేవయ్య అధ్యక్షతన నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో తుమ్మల వెంకట్‌రెడ్డి పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో 1946 నుండి 1951 వరకు తెలంగాణలో వెట్టిచాకిరికి, భూస్వాములకు వ్యతిరేకంగా ప్రజలు స్వచ్ఛందంగా తిరుగుబాటుకు నాయకత్వం వహించింది ఆంధ్ర మహాసభ కమ్యూ నిస్టు పార్టీ మాత్రమేనని అన్నారు. నాలుగున్నర వేలమంది అమరవీరుల త్యాగ ఫలంతో రాష్ట్రంలో 10 లక్షల ఎకరాల భూమి పేదలకు పంచారన్నారు. అలాంటి వీర తెలంగాణ సాయుధ పోరాటాన్ని కేంద్ర బీజేపీ పాలకులు విమోచన దినంగా పేర్కొ నడం సరికాదన్నారు. ముస్లిం రాజుకు వ్యతిరేకంగా, హిందువులు చేసిన పోరాటంగా వక్రీకరిసూ జాతీయ సమైక్యతను దెబ్బతీయడం తగదన్నారు. రాష్ట్ర ప్రజలందరూ దీనిని తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు తెలంగాణ సాయుధ స్ఫూర్తితో రాష్ట్రంలో 67 కేంద్రాల్లో గుడిసెలు వేసుకున్నారని అన్నారు. వారిపై రాష్ట్ర ప్రభుత్వం దాడులు చేస్తున్న దని పేర్కొన్నారు. తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితో భూ పోరాటాలు, ఇండ్ల స్థలాల పోరాటాలు ఉదతం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు గ్యానం వాసు, ఎండి దావూద్, సిపిఎం వాజేడు మండల కమిటీ సభ్యులు బచ్చల కష్ణ బాబు, బచ్చల సౌమ్య, కుమారి, తోలం ముత్తయ్య, జాగటి చిన్న తదితరులు పాల్గొన్నారు.