కేంద్ర ప్రభుత్వం ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగకు పద్మశ్రీ అవార్డు ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్,̺ ఎంఎస్పీ ఆధ్వర్యంలో ప్రధాన మంత్రి మోడీ, మందకృష్ణ చిత్రపటాలకు మంగళవారం పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు చిరంజీవి మాట్లాడుతూ సామాజిక న్యాయ పోరాట యోధుడు మందకృష్ణ మాదిగ గత 30 సంవత్సరాలుగా అలుపెరగని పోరాటం చేసి ఏబిసిడి వర్గీకరణ సాధించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు సరికెలా పోశెట్టి, ఎమ్మార్పీఎస్ అధికార ప్రతినిధి రమేష్, ఎంఎస్పీ మండల అధ్యక్షులు భాస్కర్, అధికార ప్రతినిధి రవి, దర్గాల సాయిలు, తెడ్డు శేఖర్, బాబన్న తదితరులు పాల్గొన్నారు.