హిందూ ముస్లిమ్స్ కలిసి దొరల దోపిడిపై తిరగబడ్డారు

The Hindu Muslims together revolted against the plunder of the nobles– సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ ప్రజా పంద తొర్రూర్ డివిజన్ కార్యదర్శి ముంజంపల్లి వీరన్న 
నవతెలంగాణ – నెల్లికుదురు
1948నుండి 1951 వరకు సాగిన మహత్తర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం హిందూ,ముస్లిం మతాల మధ్య తగాదా కాదని రెండు మతాలవారు కలిసి దొరల దోపిడీపై తిరగబడ్డారని సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ ప్రజాపంద తొర్రూర్ డివిజన్ కార్యదర్శిముంజంపల్లి వీరన్న అన్నారు. నెల్లికుదురు మండలం మెచరాజుపల్లిలో సెప్టెంబర్ 13 నుంచి 18 వరకు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట విజయాలను వివరించే కరపత్రం సోమవారం ఆవిష్కరించి కార్యక్రమాన్ని నిర్వహించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ దాని అనుబంధ హిందుత్వ శక్తులు నైజాం రాజు చెర నుండి తెలంగాణ ప్రాంతం విముక్తి సెప్టెంబర్ 17న జరిగిందని కొండంత అబద్ధాపు  ప్రచారాన్ని ఎవరు నమ్మద్దు అని అన్నారు. 1948 సెప్టెంబర్ 17న తెలంగాణ ప్రత్యేక సంస్థానాన్ని భారత యూనియన్ లో కలపటానికి కమ్యూనిస్ట్ లకు వ్యతిరేకంగా పెద్ద కుట్ర జరిగిందని అన్నారు. తెలంగాణలో మట్టి మనుషులైన పేదలు వేట్టి చాకిరికి వ్యతిరేకంగా సాగిస్తున్న సాయుధ పోరాటం దేశ విముక్తి వైపు పోకుండా తీవ్ర నిర్బంధాన్ని ప్రయోగించడానికి పటే పటేల్ సైన్యాలు, రజాకార్లు దొరలు కమ్యూనిస్టులను ఊచకోత కోశారని అన్నారు. 3000 గ్రామాలలో స్వపరిపాలన సాగిస్తూ దొరల వద్ద నుండి పది లక్షల ఎకరాలను పేదల పంచుకోగా సెప్టెంబర్ 17న ఆ భూములు మళ్లీ దొరలపాలైనా అని అన్నారు. ఇది తెలంగాణ ప్రాంత ప్రజలకు విద్రోహం కాక విముక్తి ఎలా అయితదని అవుతుందని వీరన్న ప్రశ్నించారు. భారతదేశంలో నేడు కేంద్రo లోని బీజేపీ ప్రభుత్వo విధానాలతో కలిసి ఉన్న మతాల మధ్య ప్రాంతాల మధ్య కొత్త చిచ్చు రేపుతున్నారని అన్నారు. తమ పాలన వైఫల్యాలను తెప్పించుకోవడానికి కప్పిపుచ్చుకోవటానికి ప్రజలను విభజించి హిందూ ముస్లిం కొట్లాటాలను సృష్టిస్తున్న మోడీ సర్కార్ కుట్రలను అర్థం చేసుకోవాలని వీరన్న అన్నారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు జాప్యం చేస్తూ కనీసం ఆరు గ్యారంటీల అమలు కూడా సమర్థవంతంగా చేయడంలో విఫలమైందని విమర్శించారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం మతాలకతీతంగా అన్ని కులాలు అన్ని ప్రాంతాల వారు ఒక్కటీ గా  శ్రీ పురుషులనే తేడా లేకుండా సాగిన గొప్ప పోరాటంలో 4,000 మంది ఈ ప్రాంత విముక్తి కోసం తమ అమూల్యమైన రక్తాన్ని ధారపోశారని కొనియాడారు. వారి ఆశయాలను సాధించడానికి తెలంగాణ యువత ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ నెల్లికుదురు, నరసింహులపేట సంయుక్త మoడలాల కార్యదర్శి జక్కుల యాకయ్యతో పాటు కేశవులు వెంకన్న , రవి సైదులు వెంకన్న తదితరులు  పాల్గొన్నారు.