నవతెలంగాణ – కామారెడ్డి
భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కార్యాలయంలో తెలంగాణ సాయుధ రైతాంగ 75వ. వార్షికోత్సవ సందర్భంగా కామారెడ్డి ప్రాంతానికి చెందిన పరిహార రంగాచారికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా భారత కమ్యూనిస్టు పార్టీ కామారెడ్డి జిల్లా కార్యదర్శి.ఎల్. దశరథ్ మాట్లాడుతూ.. తెలంగాణ రైతంగ సాయుధ పోరాట వలన ఆనాడు నైజం నవాబులను రజాకర్లకు వ్యతిరేకంగా పోరాటం నిర్వహించిన చరిత్ర కమ్యూనిస్టులదని లక్షలాది భూ పంపిణీ చేసి జరిగిందని 450 మంది కమ్యూనిస్టులు అమరులయ్యారని, ఆనాడు నైజం రజాకర్లు ప్రజలను అనేక ఇబ్బందులు గురిచేసి సుదీర్ఘమైనటువంటి పోరాట నిర్వహించిన చరిత్ర కమ్యూనిస్టులదని భూమి బుక్తి కోసం పోరాటం చేసిన అమరుల రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, మగ్దుల్ మొయినుద్దీన్, మన జిల్లా ప్రాంతవాసి కామారెడ్డి వాసి అయిన మణిహారం రంగాచారి లాంటి ఆనాటి యువకులు తెలంగాణ ఉద్యమంలో తమల ప్రాణాల సైతం లెక్కచేయకుండా నైజం నవాబులను గద్దె దించాలని సుదీర్ఘమైనటువంటి ఐదు సంవత్సరాలుగా అజ్ఞాత పోరాటాలు నిర్వహించిన చరిత్ర కమ్యూనిస్టు లేదని వారన్నారు. అదేవిధంగా తెలంగాణ కోసం ఆనాడే పోరాటం చేసిన చరిత్ర కలిగిన కమ్యూనిస్టు పార్టీని పట్టణంలో చేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి పి బాలరాజ్, జిల్లా నాయకులు మల్లేష్, బత్తుల ఈశ్వర్, దేవయ్య, సాయిలు, దేవరాజ్, రాహుల్, రాజవ్వ, గంగమ్మ, అనిత, సుగుణ తదితరులు పాల్గొన్నారు.