నవతెలంగాణ – ఆళ్ళపల్లి
ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పటికే చాలీచాలని డబ్బులతో మధ్యాహ్న భోజనం వర్కర్లుగా పని చేస్తున్న మాకు ప్రస్తుతం పాఠశాలల్లో విద్యార్థులకు ఉదయం అల్పాహారం పెట్టాలని నిర్ణయించిన ప్రభుత్వాలు మా గౌరవ వేతనం పెంచి ఇవ్వాలని ఆ సంఘం మండల అధ్యక్షురాలు ఈసం అరుణ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గతంలో పాఠశాలలో మధ్యాహ్న భోజనం పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని, గత కొన్ని సంవత్సరాలుగా పాఠశాలల్లో పని చేస్తున్న మాకు ప్రభుత్వం ప్రతి నెలా బిల్లులు చెల్లించాలని చెప్పారు. గతంలో ఇచ్చే గౌరవ వేతనం పెంచాలని, దానితో పాటు అల్పాహారం కోసం అదనంగా డబ్బులు ప్రభుత్వం కట్టివ్వాలని తెలిపారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వండి పెట్టకవడంతో గత 8 రోజుల లక్షల రూపాయిల ప్రజా ధనం సద్వినియోగం కాలేదని, ఆయా పాఠశాలల్లో విద్యార్థులు మధ్యాహ్న భోజనం లేక నానా అవస్థలు పడుతున్నారని వివరించారు. ఇకనైనా ప్రభుత్వం కాలయాపన మాని మా న్యాయమైన డిమాండ్లను సత్వరమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అనంతరం స్థానిక విద్యా శాఖ కార్యాలయంలో సీ.ఆర్.పీ జి.రామయ్యకు పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని గురువారం అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల మధ్యాహ్న భోజనం కార్మికులు కందిమళ్ల సరస్వతి, చింత నర్సమ్మ, ధూకుంట్ల ముత్యాలు, సిలివేరు నాగమణి, కొర్స కరుణ కుమారి, రాంబాయి, బాయమ్మ, రామలక్ష్మి, పడిగ నారాయణమ్మ, గొగ్గెల లక్ష్మి, పూనెం కన్నమ్మ, గొగ్గెల కన్నమ్మ, పాయం సుజాత, ఈసం నర్సమ్మ, సన్ప నాగమణి, బుడిగ మంగ, పూనెం బాయమ్మ, కొమరం సమ్మక్క, కొమరం లక్ష్మి, పూనెం జయ, కొమరం సుగుణ, పూనెం కన్నమ్మ, పూనెం నాగమణి, చింత నాగమణి, కొర్స లక్ష్మి, జోగ సావిత్రి, గొగ్గెల లక్ష్మి, గొగ్గెల ఎర్రమ్మ, బొమ్మల సుశీల, పూసం లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.