– కూల్చేసిన హాస్టల్ బిల్డింగును జిపి ప్రత్యేక అధికారి డాక్టర్ విజయ్ సందర్శన
– నెల రోజులు అన్నారు 8 మాసాలు అవుతుంది
– హెచ్ డబ్ల్యు ఓ గంగా సుధా
నవతెలంగాణ మద్నూర్: మండల కేంద్రంలో గల ఎస్సీ హాస్టల్ పురాతన బిల్డింగు కూల్చేశారు. కొత్త బిల్డింగ్ నిర్మాణం కోసం పట్టించుకోకపోవడం ఎస్సీ బాలికల హాస్టల్ విద్యార్థినిల అవస్థలు ఎదుర్కుంటున్నారు. గ్రామపంచాయితి ప్రత్యేక అధికారి డాక్టర్ బండి వార్ విజయ్ గురువారం ఎస్సీ బాలికల హాస్టల్ కూల్చేసిన పాత బిల్డింగును పరిశీలించారు. ఈ సందర్భంగా హాస్టల్ వార్డెన్ గంగా సుధా మాట్లాడుతూ.. హాస్టల్ బిల్డింగ్ సమస్య ఏమిటి అంటూ ఆరా తీశారు. మమ్మల్ని నెల రోజుల్లో పాత బిల్డింగ్ కూల్చివేసి టీం షెడ్డు నిర్మాణం పూర్తి చేసి ఇస్తామంటూ జిల్లా అధికారుల ఆదేశాల మేరకు హాస్టలను మండల కేంద్రంలోని ఎస్సీ బాలుర హాస్టల్లోకి మార్చడం జరిగిందని నెలరోజులు అన్నారు. ప్రస్తుతం ఎనిమిది నెలలు గడుస్తున్నా కూల్చేసిన హాస్టల్ భవనం నిర్మాణం పనులు జరగడం లేక నానా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హాస్టల్ వార్డెన్ గంగా సుధా ప్రత్యేక అధికారి దృష్టికి తీసుకువచ్చినట్టు జిపి ప్రత్యేక అధికారి డాక్టర్ విజయ్ ఎస్సీ బాలికల హాస్టల్ సమస్య పట్ల గురువారం పంచాయతీ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి హాస్టల్ సమస్య గురించి వివరాలు తెలియజేశారు.
పత్రికల్లో ఈ సమస్య ప్రచురితమైతే జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకు వెళ్లడం జరుగుతుందని పత్రిక పరంగా ఎస్సి హాస్టల్ విద్యార్థినీలా సమస్య ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లాలని విలేకరులను కోరారు. కూల్చేసిన హాస్టల్ పట్ల సంబంధిత కాంట్రాక్టర్ సంబంధం లేని విధంగా మాట్లాడుతున్నారని హాస్టల్ వార్డెన్ గంగా సుధా తెలిపారు. గత సంవత్సరం జూన్ చివరి వారంలో హాస్టల్ ఖాళీ చేసి జూలై మొదటి వారంలో ఎస్సీ బాలుర హాస్టల్ కు మార్చడం జరిగిందని మండల కేంద్రంలోని ఎస్సీ బాలికల భవన నిర్మాణం కొనసాగడం లేక ఇటు ఆడపిల్లలకు అటు ఎస్సీ బాలుర మగ పిల్లలకు ఇబ్బందికరంగా మారిందని చాలీచాలని గదులతో వివిధ సమస్యలు ఎదురవుతున్నాయని హాస్టల్ వార్డెన్ నవ తెలంగాణతో మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్య జిల్లా అధికారి దృష్టికి తీసుకు వెళ్లడం జరిగిందని తెలిపారు పంచాయతీ ప్రత్యేక అధికారి హాస్టల్ బాలికల సమస్య అటు బాలుర సమస్య జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకు వెళ్లడం జరుగుతుందని విలేకరులతో మాట్లాడుతూ తెలిపారు.