ఇల్లు దగ్ధం.. బాధితుని కుటుంబానికి తుడుం దెబ్బ చేయూత

The house was burntనవతెలంగాణ – తాడ్వాయి 
ములుగు జిల్లా తాడ్వాయి మండలం వెంగళాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని గోనెపెల్లి గ్రామానికి చెందిన రోకలి ముత్తయ్య గారి ఇల్లు ఇటీవల అగ్ని ప్రమాదానికి గురై పూర్తిగా దగ్ధమైపోయింది. అది తెలుసుకున్న తాడ్వాయి తుడుందెబ్బ మండల అధ్యక్షులు మోకాళ్ళ వెంకటేష్ ఆధ్వర్యంలో గురువారం సందర్శించి, పరామర్శించారు. వారి కుటుంబానికి బియ్యం, పప్పు, ఉప్పులు, నూనె, కారం, నూతన వస్త్రాలు, నిత్యవసర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అగ్నికి ఆహుతి అయిన రోకలి ముత్తయ్య కుటుంబం పేద కుటుంబమని, ప్రభుత్వం తక్షణ సహాయం చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా దాతలు ఎవరైనా ఉన్నా వారి కుటుంబానికి ఆదుకుని, చేయూతనందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తుడుందెబ్బ మండల అధ్యక్షులు మోకాళ్ళ వెంకటేష్, తుడుందెబ్బ  సలహాదారు తాటి నరేష్, వర్కింగ్ ప్రెస్సిడెంట్ పూనెం సుదర్శన్,  గ్రామపెద్దలు, బాధిత కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.