రెండవ రోజుకు చేరిన ఆమరణ నిరాహార దీక్ష..

The hunger strike reached its second day.– క్షిణిస్తున్న నరేందర్ ఆరోగ్యం..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
ప్రజలకు కావాల్సిన విద్య, వైద్యం, ఉపాధి, భూమి,ఇల్లు సాధనకు ధర్మ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నల్ల నరేందర్ మహారాజ్ చేస్తున్న ఆమరణ నిరాహార దీక్ష బుధవారం నాటికి  రెండవ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ ప్రజలందరికి నాణ్యమైన ఉచిత విద్య, నాణ్యమైన ఉచిత వైద్యం, నిరుద్యోగులకు ఉపాధి, భూమి లేనివారికి ఒక ఎకరం భూమి, ఇల్లు లేనివారికి 200 గజాల ఇంటి స్థలం కేటాయించే వరకు దీక్ష కొనసాగుతుందని అన్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఐదు డిమాండ్ లను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కాగా మంగళవారం నుండి ఏమి తినకపోవడంతో నల్ల నరేందర్ ఆరోగ్యం కొద్ది కొద్దిగా క్షినిస్తుంది.  ఈ కార్యక్రమంలో ధర్మ సమాజ్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్ యాదవ్, జిల్లా నాయకులు లింగస్వామి, శాంతి కుమార్, శివ, శ్రీకాంత్, సాయి, నరెందర్, స్వామి, వెంకటేష్ లు పాల్గొన్నారు.