గోపీచంద్ నటిస్తున్న యూనిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘భీమా’. లేటెస్ట్‌గా మేకర్స్ టీజర్‌ని విడుదల చేసి ప్రమోషన్స్‌ని స్టార్ట్ చేశారు. కన్నడ దర్శకుడు ఎ.హర్ష తెలుగులో డెబ్యూ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మాత కెకె రాధామోహన్ నిర్మిస్తునారు. ‘యదా యదా హి ధర్మస్య..’ అంటూ భగవద్గీత శ్లోకాల పవర్ ఫుల్ వాయిస్ ఓవర్‌తో టీజర్ ప్రారంభమవుతుంది. ‘ఈ రాక్షసుల్ని వేటాడే బ్రహ్మ రాక్షసుడు వచ్చాడ్రా’ అని బ్యాక్‌గ్రౌండ్‌లో వాయిస్ వినిపిస్తుంది. ఆ తర్వాత ఎద్దుపై కూర్చొని మ్యాసివ్, వైల్డ్ అవతారంలో పరిచయమయ్యారు గోపీచంద్. టీజర్ ఓపెనింగ్ ఆధ్యాత్మిక కంటెంట్‌తో మునులు, దుష్ట శక్తులు కనిపిస్తాయి. తర్వాత గోపీచంద్ పవర్ ఫుల్ ఎంట్రీ అద్భుతంగా ఆకట్టుకుంది. యాక్షన్ ఎంటర్‌టైనర్ ఆధ్యాత్మిక అంశాలతో కూడిన లార్జర్ దెన్ లైఫ్ కథగా ఉంటుందని ఈ గ్లింప్స్ చెప్పకనే చెప్పింది. గోపీచంద్ పోలీసు అవతార్‌లో మాచోగా కనిపించారు. ఖాకీలో పవర్-ప్యాక్డ్ లుక్‌లో గోపీచంద్‌ని చూడటం ఆయన అభిమానులకు, మాస్‌కి పండుగ. టీజర్‌లో విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. హర్ష తన అద్భుతమైన టేకింగ్‌తో ఆకట్టుకున్నారు. స్వామి జె గౌడ కెమెరా పనితనం అత్యద్భుతంగా ఉంది. ‘సలార్’ ఫేమ్ సంగీత దర్శకుడు రవి బస్రూర్ తన సెన్సేషనల్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో అదనపు ఎనర్జీని జోడించారు. ప్రొడక్షన్ డిజైన్ టాప్ క్లాస్‌లో ఉంది. టీజర్ సినిమాకి హైప్ క్రియేట్ చేసింది. ఫిబ్రవరి 16ననీ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని టీజర్ వీడియో ద్వారా అనౌన్స్ చేశారు మేకర్స్. ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు.