హైదరాబాద్ లోని తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాములు పేరును మార్చి సురవరం ప్రతాపరెడ్డి పేరును పెట్టాలనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనను విరమించుకోవాలని మంగళవారం హుస్నాబాద్ పట్టణంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నిరసన వ్యక్త చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యూనివర్సిటీ కి పొట్టి శ్రీరాములు పేరు మీదనే ఉండాలని డిమాండ్ చేశారు. భాష ప్రయుక్త రాష్ట్రాల కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి ఆంధ్ర రాష్ట్ర అవతరణ తన ప్రాణాన్ని సైతం అర్పించిన పొట్టి శ్రీరాములు పేరును ఇలాగే ఉంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం పిఎస్టీలు జిల్లా అధ్యక్షురాలు , మహిళా పి ఎస్ టి లు యూత్ అధ్యక్షుడు సోదరీమణులు పాల్గొన్నారు.