హాస్టళ్లను మూసివేసే ఆలోచనను విరమించుకోవాలి

నవతెలంగాణ-మిర్యాలగూడ
హాస్టళ్లను మూసివేసే ఆలోచనను విరమించుకోవాలని డీవైఎఫ్‌ఐ సోషల్‌ మీడియా రాష్ట్ర కన్వీనర్‌ ఎండీ.అంజద్‌, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా సహాయ కార్యదర్శి కుర్ర సైదానాయక్‌ డిమాండ్‌ చేశారు. ఎస్‌ఎఫ్‌ఐ మిర్యాలగూడ డివిజన్‌ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం ఆర్డీవో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎస్‌ఎంహెచ్‌ హాస్టల్లో విద్యార్థులు డిగ్రీ చదువుతున్నారని, జిల్లాలో ఉన్న మహాత్మా గాంధీ యూనివర్సిటీ డిగ్రీ సెమిస్టర్‌ పరీక్షలు వాయిదా వేశారని తెలిపారు. దీని కారణంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న హాస్టల్‌లను జిల్లా అధికారులు మూసివేయాలని వార్డెన్లకు హుకుం జారీ చేశారని, తద్వారా జిల్లావ్యాప్తంగా చదివి వేలాది మంది విద్యార్థులు ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈనెల 30 నుండి నడిచే సెమిస్టర్‌ ఎగ్జామ్‌ను దృష్టిలో ఉంచుకొని అధికారులు తక్షణమే హాస్టల్లో మూసివేయాలని నిర్ణయాన్ని వెనక్కి తీసుకొవాలని డిమాండ్‌ చేశారు. హాస్టల్‌లను పున ప్రారంభించాలని కోరారు. లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ టౌన్‌ కార్యదర్శి జగన్‌ నాయక్‌, దామరచర్ల మండల కార్యదర్శి వీరన్న, పవన్‌ నాయక్‌, హాస్టల్‌ విద్యార్థులు ముని, సంతోష్‌ , ఉపేందర్‌, కోటేష్‌, స్వామి, శివ, తులిసి తదితరులు పాల్గొన్నారు.