నవతెలంగాణ – భీంగల్ రూరల్
మండలంలోని బెజ్జోర, ముచ్కూర్, పీప్రీ, బాచన్ పల్లి, పల్లికొండ తదితర పాఠశాలల్లో గోడ క్యాలెండరు, టేబుల్ క్యాలెండర్ లను ఆవిష్కరించిన సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల ఉద్యోగ విరమణ వయస్సు 61 సంవత్సరాల నుండి 63 సంవత్సరాలు పెంపు విషయంపై ప్రభుత్వా నికి ఆలోచన ఉంటే వెంటనే విరమించుకో వాలనీ డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ భీంగల్ శాఖ అధ్యక్షులు జాన్ విల్సన్ కోరారు. ఈ విషయంపై గత కొన్ని రోజులలో వివిధ పత్రికలలో, టీవీ మాధ్యమా లలో, సోషల్ మీడియా లలో పుంఖాను పుంకాలుగా వార్తలు వస్తున్నాయని వారు పేర్కొన్నారు. గత ప్రభుత్వం ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 58 నుండి 61 సంవత్సరాలకు పెంచడం ద్వారానే అనేకమంది నిరుద్యోగులకు అన్యాయం జరిగింది వేలాది మంది ఉపాధ్యాయులకు ప్రమోషన్ అవకాశాలు దెబ్బ తిన్నాయని ,వయసు రీత్యా ఉద్యోగులకు అనారోగ్య సమస్యలు ,పనిలో మందకోడితనం లాంటి అనేక సమస్యలు ఉత్పన్నమయ్యాయి అన్నారు. ఇలాంటి సమస్యలను సరిదిద్దాల్సింది పోయి మళ్ళీ ఉద్యోగ విరమణ వయసు పెంపు సరికాదన్నారు. పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు ఇవ్వాల్సిన వివిధ చెల్లింపుల భారం తగ్గించుకోవడం తదితర కారణాలతో ఈ నిర్ణయం తీసుకుంటే ఇది భవిష్యత్ తరాలకు గొడ్డలి పెట్టని విల్సన్ అభిప్రాయపడ్డారు. అదేవిధంగా పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులను విడుదల చేయాలి అన్నారు. అనంతరం భీంగల్ మండల శాఖ ప్రధాన కార్యదర్శి గట్టు ఈశ్వర్ మాట్లాడుతూ నాలుగు విడతల పెండింగ్లో ఉన్న డి ఏ లు విడుదల చేయాలని, రెండు సంవత్సరాల క్రితం వేసిన పిఆర్సి కమిటీ రిపోర్ట్ తెప్పించి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు కాలయాపన చేయకుండా తక్షణమే పిఆర్సి అమలు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు హఫీజ్, రమేష్ మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.