నవతెలంగాణ – డిచ్ పల్లి
ఇందల్ వాయి మండలంలోని సంస్థాన్ సిర్నపల్లి గ్రామంలోని గడి వాడ కాలోనికి చేందిన పలువురు యువకులు మేము సైతం అంటూ ముందుకు వచ్చి తమ స్వంత డబ్బులు పేట్టుకుని గ్రామ శివారులోని బ్రిడ్జి వద్ద సిమెంట్ బస్తాలు తీసుకుని వచ్చి గుంతలను స్వచ్ఛందంగా పూర్తి వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బస్సులు, ఆటోలు, ద్విచక్ర వాన దారులు రాకపోకలు సాగించే సమయంలో పెద్ద గుంతలు పడడంతో మహిళలకు గర్భిణీలకు ఇబ్బందుల అవుతున్నాయనే సదు ద్దేశంతో గడి వాడ కాలనీకి చెందిన యువకులం ముందుకు వచ్చి గుంతలను పూడ్చివేసినట్లు తెలిపారు. ఎవరో వస్తారు ఏదో చేస్తారని చూడకుండా తమవంతుగా గ్రామానికి వచ్చే రహదారికి గుంతలను లేకుండా గడి వాడు కు చెందిన పలువురితో కలిసి వారి సహాయ సహకారాలతో పూర్తి చేసినట్లు మహమ్మద్ జాహిద్ వివరించారు. ఇతరుల మీద ఆధార పడకుండా గ్రామానికి వచ్చే రహదారి వెంట గుంటలను పూడ్చి వేయడంతో పలువురు వీరు చేసిన కృషిని అభినందించారు. వీరు ఎందరికో స్పుర్తిగా ఆదర్శంగా నిలిచారు. ఈ కార్యక్రమంలో మొహమ్మద్ జాహిద్, మహమ్మద్ ఇస్మాయిల్ ,ఎలక్ట్రిషన్ రాజు, శేఖర్, ఫర్హాన్ ఉన్నారు