మండలంలోని అరూరు గ్రామంలో బద్దo రామకృష్ణా రెడ్డి కాలనీలో బద్దo చంద్ర శేఖర్ రెడ్డి సౌజన్యంతో నిర్మించిన శ్రీ మహాలింగేశ్వర ఆలయంలో పెద్దిటి సత్తిరెడ్డి సౌజన్యంతో ఏర్పాటు చెందిన విగ్రహాలను శుక్రవారం ఘనపతి, సుబ్రమణ్య స్వామీ, నవగ్రహ విగ్రహాలను సిద్ధాంత కళాప్రపూర్ణ బేతోజు సత్యనారాయణ శాస్త్రి బృందం వారిచే ప్రతిష్టాపన కార్యక్రమం చేశారు. అంతకు ముందు ఘనపతి పూజా,మోహినీ క్షేత్ర పాలకులకు వాస్తు పూజా, మండల పూజలు, జలాదివాసం, ధాన్యాది వాసం, పుష్పాది వాసం మొదలగు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బద్దం చేతన్ రెడ్డి, చందన్ రెడ్డి, తుమ్మల రవీందర్ రెడ్డి,పైళ్ల ఋషి రెడ్డి, సాయి కిరణ్ రెడ్డి, మోదాల వెంకటేష్, రాములు తదితరులు పాల్గొన్నారు.