
గిరిజనుల ఆరాధ్య దైవం సేవాలాల్ అని ప్రముఖ పారిశ్రామిక వేత్త బిజెపి నాయకులు పైడి రాకేష్ రెడ్డి అన్నారు. ఆలూరు మండలం గుత్పా తండా, మక్లుర్ మండలం ఎల్యనాయక్ తండా గ్రామంలో తీజ్ పండుగ కార్యక్రమంలో ఆదివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గిరిజనుల ఆరాధ్య దైవం సేవలల్ అని ప్రకృతి నీ పూజించే సంస్కృతి నిత్యం ప్రకృతి ఒడిలో ఉంటు పనులు చేసే గొప్ప సంస్కృతి గిరిజనుల ది అని అన్నారు గిరిజనులకు ప్రకృతికి నిత్యం అనుబంధంగా పనులు వారి వ్యవహార శైలి ఉంటుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ అసెంబ్లి కన్వీనర్ పలెపూ రాజు, అలుర్ మండల అధ్యక్షుడు గిరీష్, మాక్లుర్ మండల అధ్యక్షుడు సురేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.