
గిరిజనుల అభివృద్ధికి,వారి హక్కుల సాధన కోసం,తన జీవితాన్నే త్యాగం చేసిన గొప్ప మహానుభావుడు,గిరిజనుల ఆరాధ్య దైవం శ్రీ శ్రీ సంతు సేవాలాల్ మహారాజ్ అని ఆరాధ్య ఫౌండేషన్ చైర్మన్ తాడోజ్ వాణి శ్రీకాంత్ రాజ్ అన్నారు.ఆదివారం తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలోని సిరి ఫంక్షన్ హాల్ లో ఆరాధ్య ఫౌండేషన్ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు జయపాల్ నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ శ్రీ సంతు సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకల కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు.ఈ మేరకు కుల,మతాలను ప్రోత్సహించడం వల్లే అనేక ఇబ్బందులు వస్తాయని గ్రహించి సమాజంలో మనమంతా ఒక్కటే అన్న భావజాలాన్ని వెలుగెత్తి చెప్పిన గొప్ప యోగి అని అన్నారు.సంత్ సేవాలాల్ మహారాజ్ కేవలం గిరిజనుల ఆరాధ్య దైవం మాత్రమే కాదని,అందరికీ ఆరాధ్యుడేనని అన్నారు.గిరిజనులకు దశ-దిశను చూపి,హైందవ ధర్మం యొక్క గొప్పతనాన్ని,విశిష్టతలను తెలియ జేయడానికే సేవాలాల్ మహారాజ్ జన్మించారని చరిత్రకారులు చెబుతారని పేర్కొన్నారు.బంజారా జాతి ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటేలా అహింసా సిద్ధాంతానికి పునాదులు వేశారని వెల్లడించారు.దీంతో శ్రీ సంత్ సేవాలాల్ ఇతర కులాల వారికి కూడా ఆదర్శ మూర్తిగా నిలిచారని పేర్కొన్నారు.ప్రతి ఒక్కరూ మన సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుకోవాలని సూచించారు.సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు అధికారికంగా తెలంగాణ రాష్ట్రంలో తప్ప దేశంలో ఇంకెక్కడా జరపడం లేదంటే ఇది మన రాష్ట్ర గొప్పతనమని కొనియాడారు.నియోజకవర్గంలోని గిరిజనుల అభివృద్ధి కోసం తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని వాణి శ్రీకాంత్ రాజు అన్నారు.అంతకుముందు నియోజకవర్గంలోని గిరిజనులు అంతా అంబేద్కర్ చౌరస్తా నుండి సిరి ఫంక్షన్ హాల్ వరకు నిర్వహించిన ర్యాలీలో ఆరాద్య ఫౌండేషన్ చైర్మన్ ముఖ్యఅతిథిగా పాల్గొని గిరిజన సంప్రదాయ నృత్యాలతో ఆటపాటలతో అలరించారు.యువతులు,మహిళలతో కలిసి బంజారా సాంప్రదాయ నృత్యం చేశారు.అనంతరం బంజారాల పూజారి ఎంతో భక్తిశ్రద్ధలతో నిర్వహించిన బోగు బండార్ ఉత్సవాలను ఆనందోత్సవాలతో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రజా కవి,కళాకారుడు గిద్దే రామనర్సయ్య తన ఆటపాటలతో కార్యక్రమాన్ని ఉర్రూతలూగించరు.శ్రీ శ్రీ సంత సేవాలాల్ మహారాజ్ జయంతి కార్యక్రమాన్ని ఇంత గొప్పగా నిర్వహించడానికి ఆర్థికంగా సహకరించిన ఆరాధ్య ఫౌండేషన్ చైర్మన్ తాడోజ్ వాణి శ్రీకాంత్ రాజ్ దంపతులను నియోజకవర్గ పరిధిలోని గిరిజనులంతా ఘనంగా సన్మానించి ప్రత్యేక అభినందనలు తెలిపారు.ఈ వేడుకల్లో ఆరాద్య ఫౌండేషన్ ఫౌండర్ శ్రీకాంత్ రాజ్,మహారాష్ట్ర కోయిల్ ఘడ్ గిరిజన పూజారి రమేష్ మహారాజ్,వరంగల్ సీఐ కాన్సిరాం నాయక్,డాక్టర్ రమేష్ నాయక్,రామచంద్ర నాయక్,సొమ్ల నాయక్,అంబటి రాములు,రమేష్ నాయక్,రామ్ సింగ్ నాయక్,నాగేందర్ నాయక్,కిషన్ నాయక్,ఆరాధ్య ఫౌండేషన్ వివిధ మండలాల అద్యక్షులు,సభ్యులు,గిరిజన సంఘం నాయకులు,మహిళలు తదితరులు పాల్గొన్నారు.