హార్టేక్స్‌ రబ్బర్‌ అక్రమ లాకౌట్‌ను ఎత్తివేయాలి

వెంటనే వేతన ఒప్పందం చేయాలి
కార్మిక చట్టాలను తుంగలో తొక్కిన యజమాన్యం
అన్ని సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమిస్తాం
సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు కె.రాజయ్య
నవతెలంగాణ ఐడిఎ బొల్లారం
‘హార్టేక్స్‌ రబ్బర్‌ అక్రమ లాకౌట్‌ను ఎత్తివేయాలి. వెంట నే వేతన ఒప్పందం చేయాలి. యాజమాన్యం కార్మిక చట్టాల ను తుంగలో తొక్కింది. అన్ని సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమి స్తాం’ అని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు కె.రాజయ్య హెచ్చరించారు. బొల్లారంలోని హార్టేక్స్‌ రబ్బర్‌ పరిశ్రమ అక్రమంగా విధించిన లాకౌట్‌ను ఎత్తివేయాలన్నారు. అక్రమ సస్పెండ్‌లను ఉపసంహరించుకోవాలని అన్నారు. బుధవా రం కార్మికులు చేస్తున్న శిబిరానికి వెళ్లిన రాజయ్య సంఘీభా వం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోనే ఇలాంటి పరిశ్రమ యాజమాన్యం చూడలేదన్నా రు. ఏ ఒక్క కార్మిక చట్టాన్ని అమలు చేయట్లేదని తీవ్రంగా విమర్శించారు. 8 సంవత్సరాల నుంచి అగ్రిమెంట్‌ చేయక పోవడం అత్యంత దుర్మార్గమన్నారు. 25 సంవత్సరాల నుం చి పరిశ్రమ నడుపుతున్నప్పటికీ రూ.20 వేల వేతనాలు కూడా లేవని అన్నారు. ఇంత తక్కువ వేతనాలు ఉన్న పరిశ్ర మ ఇదేనన్నారు. కనీస వేతనాలు అమలు చేయట్లేదన్నారు, కనీస వేతనం తుంగలో తొక్కడం దుర్మార్గమన్నారు, ఈ పరిశ్రమ మీద అన్ని చట్టపరమైన సంస్థలకు ఫిర్యాదు చేస్తామని ఆయన తెలియజేశారు. కనీస వేతనానికి లోబడి పని చేయించుకోవడం అత్యంత దుర్మార్గమన్నారు, వెంటనే వేతన ఒప్పందం చేయాలని డిమాండ్‌ చేశారు. సమస్యలను ప్రశ్నిస్తే జనరల్‌ సెక్రెటరీ అనేక మందిని సస్పెండ్‌ చేయడం మరో ఘోర తప్పిదమన్నారు. లాకౌట్‌ చట్టం విరుద్ధమన్నారు, లాకౌట్‌ కు ప్రభుత్వం తరఫున ఎలాంటి అనుమతులు తీసుకోలేదన్నారు. కార్మికులను భయభ్రాం తుల గురి చేస్తుందని అన్నారు, కార్మికులందరూ సంఘ టితంగా పోరాడాలని, సిఐటియు మద్దతు సంపూర్ణంగా ఉంటుందని తెలియజేశారు. కార్యక్రమంలో పిపిఎల్‌ నాయకులు శ్రీనివాస్‌, నరసింహులు, అలాగే యూనియన్‌ అధ్యక్షులు టిఆర్‌ఎస్కెవి నాయకులు వర ప్రసాద్‌ రెడ్డి, జనరల్‌ సెక్రెటరీ, కార్మికులు పాల్గొన్నారు.