– మోసపోతున్న వినియోగదారులు
– దృష్టి సారించని లీగల్ మెట్రాలజీ అధికారులు
నవతెలంగాణ – సిరిసిల్ల టౌన్
మార్ట్ ల్లో తక్కువ ధరలకు వస్తువులు దొరుకుతాయన్న కస్టమర్ల నమ్మకం వమ్ము చేస్తూ చేస్తూ ఎమ్మార్పీ ధర కన్నా ఎక్కువ వసూల్ చేస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. సిరిసిల్ల పట్టణంలో ఏర్పాటుచేసిన రిలయన్స్ మార్ట్ కి శ్రీకాంత్ అనే వ్యక్తి నిత్యవసర సరుకులు కొనేందుకు వెళ్లాడు. తను తీసుకున్న వస్తువుల్లో ఫ్లోర్ క్లీనర్ బాటిల్ పై ధర రూ. 110 ఉండగా బిల్ లో రూ. 120.54 వేశారు. బిల్లు చుసిన వినియోగదారుడు కంగు తిన్నాడు. బాటిల్ పై ఉన్న ఎమ్మార్పీ ధర కంటే ఎక్కువ ఎందుకు వేశారని ప్రశ్నించగా నిర్లక్ష్యపు సమాధానం చెప్పినట్లు వినియోగదారుడు వాపోయాడు. అధిక ధరలకు విక్రయిస్తూ మోసాలకు పాల్పడుతున్న మార్టూల్లో, దుకాణాల్లో సంబంధిత అధికారులు దృష్టి సారించాలని కోరారు. కాగా బిల్ చూసి వినియోగదారుడు జరిగిన మోసాన్ని గ్రహించాడు. ఈ లెక్కన బిల్ చూడకుండా మోసపోతున్న వినయోగదారులు ఎంతో మంది ఉండొచ్చు.