క్యూబాపై సామ్రాజ్యవాద దౌర్జన్యం నశించాలని సీఐటీయూ జన్నారం మండల సీనియర్ నాయకులు కూకటికారి బుచ్చయ్య అన్నారు. మంగళవారం సీపీఐ(ఎం) పార్టీ కార్యాలయంలో కరపత్రాలను విడుదల చేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ క్యూబాపై అమెరికా వేసిన ఆంక్షలు ఎత్తివేయాలన్నారు. దీనిపై ఐక్యరాజ్యసమితిలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. ఈ పరిణామాన్ని సీఐటీయూ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు అంబటి లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.