నవతెలంగాణ – చేర్యాల
దూలిమిట్ట మండలంలో హోండా డియో టెంపరరీ టీఎస్ 07 బిఈ టీఆర్ 9942 గల వాహనంపై గుడుంబాను ఇటీవల తరలిస్తుండగా పట్టుకున్నట్లు ఎక్సైజ్ ఎస్ఐ సురేష్ తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం ఎస్ఐ మాట్లాడుతూ.. పట్టు బడిన వాహనాన్ని ఈ నెల 28న చేర్యాల ఎక్సైజ్ కార్యాలయంలో వేలం వేస్తున్నట్లు పేర్కొన్నారు. వేలంలో పాల్గొనే వారు వాహనం రేటులో 25 శాతం నగదు రూపంలో వేలానికి ముందుగా జమ చేసి వేలంలో పాల్గొనాలని, వాహనం ఖరీదు రూ.25 వేలు ఉంటుందన్నారు.