గ్రూప్ 1 పరీక్ష కేంద్రాలను పర్యవేక్షించిన ఇంచార్జి పోలీస్ కమీషనర్

నవతెలంగాణ – కంటేశ్వర్
నిజామాబాద్ పోలీస్ కమీషనరేటు పరిధిలో నిర్వహిస్తున్న గ్రూప్ 1 పరీక్షను 41 కేంద్రాల్లో ఏర్పాటు చేయగా వాటిని ఆదివారం నిజామాబాద్ పోలీస్ కమీషనర్ సి.హెచ్. ప్రవీణ్ కుమార్, ఐ.పి.యస్. ఆద్వర్యంలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది. అన్ని పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించడం జరిగింది. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని రకాల చర్యలు తీసుకో వడం జరిగింది. అన్ని పరీక్ష కేంద్రాలను పోలీస్ కమీషనర్ క్షుణ్ణంగా పర్యవేక్షించడం జరిగింది. అన్ని పరీక్ష కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది.బందోబస్తు వివరాలు ఈ విధంగా ఉన్నాయిపోలీస్ కమీషనర్ = 1,అదనపు డి.సి.పి( అడ్మిన్) = 1,ఎ.సి.పి లు = 1,సి.ఐలు = 5,ఎస్.ఐలు = 27,ఎ.ఎస్.ఐలు / హెడ్ కానిస్టేబుల్స్ = 37,పోలీస్ కానిస్టేబుల్స్ / హోమ్ గార్డులు = 54,మహిళా సిబ్బంది = 47 రిజర్వు విభాగం సిబ్బంది = 9 మంది పోలీస్ సిబ్బంది పరీక్ష కేంద్రాల వద్ద బందోబస్తులో ఉన్నారు. వీటిని పర్యవేక్షణ నిజామాబాద్ ఇన్చార్జి పోలీస్ కమిషనర్ ప్రవీణ్ స్వయంగా పర్యవేక్షించారు. ఎక్కడ కూడా ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎక్కడికక్కడ పోలీస్ బందోబస్తును అలర్ట్ చేశారు.