– ఏడాదికి రూ.2.5 లక్షలే
న్యూఢిల్లీ : మెజారిటీ డెలివరీ బార్సు (గిగ్ వర్కర్లు) అల్పాదాయాలతో జీవితాలను నెట్టుకొస్తున్నారు. దేశంలోని 77.6 శాతం మంది డెలివరీ కార్మికుల సంవత్సరానికి రూ.2.5 లక్షల కంటే తక్కువ సంపాదిస్తున్నారని మనీ కంట్రోల్ ఓ కథనంలో తెలిపింది. 40 నగరాల నుంచి 2,000 మంది గిగ్ డెలివరీ వర్కర్లను సర్వే చేయగా.. ఈ కార్మికులలో దాదాపు 20 శాతం మంది వార్షిక ఆదాయం రూ. 2.5 లక్షల నుండి రూ. 5 లక్షల మధ్య ఉందని తేలింది. కేవలం 2.6 శాతం మంది కార్మికులు మాత్రమే రూ.5 లక్షల నుంచి రూ.7.5 లక్షల వరకు సంపాదిస్తున్నారని వెల్లడయ్యింది. పోర్టర్, జొమాటో, స్విగ్గి, ఉబెర్, ఢిల్లీవెరీ, ఓలా, షాడోఫ్యాక్స్, రాపిడో, జెప్టో, షిప్రోకెట్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, డన్జో, ఈకామ్ ఎక్స్‌ప్రెస్, ఎకార్ట్, డొమినోస్, జియో మార్ట్, అర్బన్ కంపెనీ వంటి బహుళ ప్లాట్‌ఫారమ్‌ల కోసం పనిచేస్తున్న డెలివరీ సిబ్బంది నుంచి ఈ డేటా సేకరించింది.