– పీఎన్ పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు రాఘవేందర్ గౌడ్
– అధికారులు స్పందించకుంటే 28న ప్రజా ధర్నా
నవతెలంగాణ-కుల్కచర్ల
మండల కేంద్రంలో ప్రధాన చౌరస్తా నుండి చిన్న గేట్ వరకు అసంపూర్తిగా ఉన్న రోడ్డు వెంటనే పూర్తి చే యాలని లేనిపక్షంలో ఈనెల 28న వ్యాపారస్తులతో కలిసి ప్రజా ధర్నా నిర్వహిస్తామని పరిగి నియోజకవర్గం పరి రక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు రాఘవేందర్‌గౌడ్ హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ..రోడ్డు పనులు ప్రారంభించి 3 ఏండ్లు గడుస్తున్నా ప్రజా ప్రతినిధులు అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవ హరిస్తున్నారని విమర్శించారు. వర్షాలు కురుస్తున్నాయని గతంలో అనేక మంది వాహనదారులు రోడ్డు ప్రమా దా నికి గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి రోడ్డు పనులు వెంటనే పూర్తి చేయాలని లేదం టే పీఎన్ పీఎస్ ఆధ్వర్యంలో వ్యాపారస్తులతో కలిసి భారీ ఎత్తున ధర్నా రాస్తారోకో నిర్వహిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో హరికృష్ణ, శ్రీనివాస్, బచ్చయ్య, విష్ణు, శ్రా వణ్, రాంచంద్రయ్య, హనుమంతు, శేఖర్ యాదవ్, కిష్ట య్య, తదితరులు పాల్గొన్నారు.