పెంచిన వేతనాన్ని వెంటనే అందజేయాలి

–  కండ్లకు గంతులు కట్టుకొని మోకాళ్లపై నిరసన వ్యక్తం చేసిన మధ్యాహ్న భోజన కార్మికులు
– పెంచిన వేతనాలు వెంటనే ఇవ్వకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు చక్రపాణి డిమాండ్
నవతెలంగాణ -మద్నూర్
మధ్యాహ్న భోజన కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం పెంచిన  3 వేల వేతనాన్ని వెంబటే ఇవ్వాలని ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు చక్రపాణి ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. మద్నూర్ మండల కేంద్రంలో చేపట్టిన మధ్యాహ్న భోజన కార్మికుల ఆందోళనకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై వారికి మద్దతుగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి , అంటూ ప్రభుత్వానికి డిమాండ్ చేశారు కండ్లకు గంతులు కట్టుకొని మోకాళ్ళపై నిరసన వ్యక్తం చేపట్టారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్  అసెంబ్లీ సాక్షిగా 2022 మార్చిలో ప్రతి ఒక్క మధ్యాహ్న భోజన కార్మికునీకి నెలకు 3000 చెల్లిస్తానని హామీ ఇచ్చి కాలయాపన చేస్తూ 2023 మార్చి లో జీవో తెచ్చినప్పటికీ నెలకు 3000 చెల్లించడం లేదని ఆరోపించారు మధ్యాహ్న భోజన నిర్వాహకులకు ఇవ్వాల్సిన ఐదు నెలల పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని సమ్మె నిర్వహిస్తున్న ప్రభుత్వంలో ఉలుకు పలుకు లేదని పేర్కొన్నారు ఈ ప్రభుత్వము ఉన్నోడికి దోచిపెడుతున్నది లేనోళ్లకు బిచ్చమడుకోమని చెప్పి విధంగా చేస్తున్నదని విమర్శించారు మధ్యాహ్న భోజన నిర్వాహకుల పట్ల ప్రభుత్వ మొండి వైఖరి విడనాడాలి విధానాలను  నిరసిస్తున్నారు ప్రభుత్వం బిల్లులు వేతనాలు చెల్లించకపోవడంతో ఇంట్లో ఉన్న ఆస్తులు  తాకట్టు పెట్టిప్రభుత్వ పాఠశాలకు కావలసిన నిత్యవసర వస్తువులు కొనలేక నేడు కార్మికులకు మానసిక ఆర్థిక భారంతో ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ప్రభుత్వం కల్పిస్తా ఉన్నది కార్మికులు ఈరోజు మోకాళ్లపై ఉండి కండ్లకు గంతలు కట్టుకొని నిరసన తెలుపడం జరుగుతుందన్నారు  ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే వారికి రావాల్సిన పెండింగ్ బిల్లులతో పాటు జీతభత్యాలు చెల్లించాలని తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) రాష్ట్ర ఉపాధ్యక్షులు తోపునూరి చక్రపాణి ప్రభుత్వానికి డిమాండ్ చేశారు  మండల సమితి ఆధ్వర్యంలో   మండల అధ్యక్షురాలు సావిత్రి సాయమ్మ  ,ఈ కార్యక్రమంలో మండల కార్మికులు  భూదేవి గంగమణి లక్ష్మి సరిత పెద్ద సంఖ్యలో మధ్యాన్న భోజనం కార్మికులు పాల్గొన్నారు.