గాయపడ్డ నెమలిని ఫారెస్ట్ అధికారులకు అప్పగించిన రైతులు 

నవతెలంగాణ -చేర్యాల 
చేర్యాల మండలం దానంపల్లి గ్రామ శివారులో  బుర్ర శివకుమార్, మల్లం లక్ష్మయ్య అనే రైతుల వ్యవసాయ బావి వద్ద నెమలి గాయపడి కనిపించడంతో బుధవారం రైతులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు.సమాచారం అందుకున్న ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రాముడు కు రైతులు నెమలిని అప్పగించారు.ఈ సందర్భంగా రాముడు మాట్లాడుతూ గాయపడ్డ నెమలికి ఆసుపత్రిలో చికిత్స చేయించి తమ సంరక్షణలో ఉన్నట్లు పేర్కొన్నారు.