– పటోళ్ల కార్తీక్ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కేంద్రం నుంచి రాష్ట్రాలకు వచ్చే నిధుల్లో రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారుకు పట్టదా? అని బీఆర్‌ఎస్ నేత పటోళ్ల కార్తీక్ రెడ్డి ప్రశ్నించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. రూ.2,500 కోట్ల కన్సాలిడేటెడ్ ఫండ్ నిధులు తెలంగాణ నుంచి ఆంధ్రకు వెళ్లాయని తెలిపారు. గతంలో పొరపాటున తెలంగాణ నుంచి ఏపీకి బదిలీ అయిన రూ.450 కోట్లు తిరిగి రప్పించాలని డిమాండ్ చేశారు. హైడ్రాతో రాష్ట్రానికి ఒరిగేదేమి లేదని విమర్శించారు. ఒఆర్‌ఆర్ లోపలి పరిధి చెరువుల్లో గత కొన్నేండ్లుగా ఇండ్లు కట్టుకున్న వారి నుంచి ఎల్‌ఆర్‌ఎస్ కట్టించుకుంటున్న సర్కార్ వారి ఇండ్ల విషయంలో స్పష్టతనివ్వాలని డిమాండ్ చేశారు.