నాకు జరిగిన అన్యాయం ఏ కార్యకర్తకు జరగొద్దు

– టీపీసీసీ రాష్ట్ర మాజీ కార్య నిర్వాహక కార్యదర్శి రవీందర్‌
నవతెలంగాణ-నకిరేకల్‌
కాంగ్రెస్‌ పార్టీలో తనకు జరిగిన అన్యాయం పార్టీ జెండా మోసిన ఏ ఒక్క కార్యకర్తకు జరగవద్దని టీపీసీసీ రాష్ట్ర మాజీ కార్యనిర్వాహక కార్యదర్శి దైద రవీందర్‌ పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని గోరంట్లపల్లి గ్రామంలో ఆ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఐదేళ్లుగా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ పార్టీని కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకున్నానని పేర్కొన్నారు. అయినా నాకు పార్టీ అన్యాయం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ముందు ఏ పదవి వచ్చినా, రాకున్నా నా తోడు ఎవరు లేకున్నా ఒక్కడిగానే ప్రజల మధ్య ఉంటానన్నారు. మీకు ఏ కష్టం వచ్చినా చేదోడువాదోడుగా వెన్నంటి ఉంటానన్నారు. ఎవరు ఆ ధైర్యపడోద్దని తెలిపారు. ఈ సమావేశంలో గ్రామ కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.