ఆగి ఉన్న లారీని ఢకొీట్టిన ఇన్నోవా

– జహీరాబాద్‌ సమీపంలో ప్రమాదం.. ఇద్దరు మృతి
నవతెలంగాణ-జహీరాబాద్‌
ఆగి ఉన్న లారీని ఇన్నోవా కారు ఢకొీట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటన శుక్రవారం ఉదయం సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్‌ సమీపంలో జాతీయ రహదారి 65పై జరిగింది. జహీరాబాద్‌ ఎస్‌ఐ శ్రీకాంత్‌ తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటక రాష్ట్రానికి చెందిన కవిరాజ్‌, ఆయన మిత్రుడు ఎవరేశ్‌ ఇన్నోవా వాహనంలో శుక్రవారం ఉదయం హైదరాబాద్‌ వైపు వస్తున్నారు. అదే సమయంలో సాంకేతిక లోపంతో జాతీయ రహదారి-65పై లారీ ఆగింది. ఆ లారీని వెనకాల నుంచి ఇన్నోవా వాహనం బలంగా ఢకొీట్టింది. ఈ ప్రమాదంలో కవిరాజ్‌, ఎవరేశ్‌ అక్కడికక్కడే మృతిచెందారు. ఘటనా స్థలాన్ని జహీరాబాద్‌ డీఎస్పీ వి.రఘు, సీఐ బి.రాజు పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిర్వహించి వారి బంధువులకు అప్పగించారు. ఈ మేరకు కేసు దర్యాప్తులో ఉంది.