నవతెలంగాణ – బెజ్జంకి
తెలంగాణ సిద్ధాంతకర్త,ఉద్యమ స్ఫూర్తి ప్రదాతగా రాష్ట్ర ప్రజల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న అచార్య ప్రొఫెసర్ జయశంకరని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కొనియాడారు.మంగళవారం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటుచేసిన ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పాల్గొని ఎంపీడీఓ కడవెర్గు ప్రవీన్ తో కలిసి అయన చిత్ర పటానికి పూలతో నివాలర్పించారు.అనంతరం అయా గ్రామాల్లోని 92 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ రూ.24,52,500 సీఎం సహాయనిధి చెక్కులందజేశారు.తహసిల్దార్ శ్రీనివాస్ రెడ్డి,పీఆర్ ఏఈ సమ్మయ్య,నాయకులు రత్నాకర్ రెడ్డి, దామోదర్,విభాగాల నాయకులు,అయా గ్రామాల కార్యకర్తలు హజరయ్యారు.
బాలికల ప్రభుత్వోన్నత పాఠశాల సందర్శన..
మండల కేంద్రంలోని బాలికల ప్రభుత్వోన్నత పాఠశాలను ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అకస్మికంగా సందర్శించి పరిసరాలను పరిశీలించారు.స్వచ్ఛదనం..పచ్చదనం కార్యక్రమంలో పాఠశాలలో ఎమ్మెల్యే బోధన సిబ్బంది, విద్యార్థులలతో కలిసి మొక్కను నాటారు. పాఠశాలలో విద్యాబోధన,సౌకర్యాలు,పదవి తరగతిలో ఉత్తీర్ణత శాతం వివరాలను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు.పాఠశాల అవరణంలో అంగన్వాడీ భవనాల నిర్మాణానికి సహకరించాలని బోధన సిబ్బందికి సూచించారు.