గాంధీ విగ్రహం ఏర్పాటు హర్షనీయం

The installation of Gandhi statue is delightful– సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదములు తెలిపిన గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ కోడి శ్రీనివాసులు 
నవతెలంగాణ – చండూరు  
అంతర్జాతీయ స్థాయిలో అతిపెద్ద మహాత్మా గాంధీ విగ్రహం హైదరాబాదులోని బాపు ఘాట్ లో గాంధీ ఆలోచన విధానాన్ని ప్రతిబింబించే విధంగా నిర్మిస్తామని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించడం హర్షనీయమని గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు ట్రస్మా జిల్లా అధ్యక్షులు డాక్టర్ కోడి శ్రీనివాసులు అన్నారు.  సీఎం రేవంత్ రెడ్డి, మంత్రివర్గం ఆమోదంతో ప్రపంచంలో అతి ఎతైన మహాత్మా గాంధీ విగ్రహం ఏర్పాటు చేయాలన్న నిర్ణయానికి సంఘీభావంగా గాంధీజీ విద్యాసంస్థలలో జరిగిన కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాఠశాల క్యాంపస్ లోని గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి, నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ కోడి శ్రీనివాసులు మాట్లాడుతూ.. మహాత్ముడి జీవితం యావత్ ప్రపంచానికి ఆదర్శం, మార్గదర్శనం కావాలని అన్నారు.  బాపూజీ చూపిన సత్యం, అహింసా మార్గంలో  భావితరాలు నడవాలని, సుస్థిర విద్య, వైద్యం, సేంద్రీయ వ్యవసాయం, ఇంధనవనరులు, పరిశ్రమల స్థాపన ద్వారా సంపూర్ణ గ్రామస్వరాజ్యం రామరాజ్యం సాధించాలని, తద్వారా గాంధీజీ కలలుగన్న అవినీతిరహిత భారతదేశాన్ని నిర్మించుకోవాలని విద్యార్ధులకు సూచించారు. గాంధీజీ భారీ విగ్రహం ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నసీఎం రేవంత్ రెడ్డికి హర్షధ్వానాలతో అధ్యాపకులు విద్యార్ధులు ధన్యవాదములు తెలిపారు. గాంధీ గ్లోబల్ ఫామిలీ, గాంధీ జ్ఞాన్ ప్రతిష్ఠాన్ చైర్మన్ డా.గున్నా రాజేందర్ రెడ్డి సూచన మేరకు ఈ కార్యక్రమం ఏర్పటు చేయడం చాలా సంతోషముగా వుందని అన్నారు.  ఈ కార్యక్రమంలో గాంధీజీ విద్యాసంస్థల డైరెక్టర్  సరికొండ వెంకన్న, ప్రిన్సిపాల్ సత్యనారాయణ మూర్తి, కందుల కృష్ణయ్య, పులిపాటి రాధిక, పాలకూరి కిరణ్ ఇతర అధ్యాపక బృందం పాల్గొన్నారు.