ఇజ్రాయెల్ యుద్ధ నేరాలను అమెరికా, యూరోపియన్ యూని యన్ కప్పిపుచ్చుతున్నాయని భారత్‌లోని పాలస్తీనా రాయబారి అద్నాన్ అబు అల్హైజా అన్నారు. అంతేగాక, ఇప్పుడు ఇజ్రాయిల్ దేశ చరిత్రలో అత్యంత తీవ్రవాద ప్రభుత్వం ఉంది. అంతర్జాతీయ సమాజం ఇజ్రాయెల్‌పై గట్టి ఒత్తిడి తెస్తే తప్ప పాలస్తీనా ప్రజలకు న్యాయం లభించదు. 60 లక్షల మంది పాలస్తీనియన్లను శాశ్వతంగా లొంగదీసుకోవచ్చని ఇజ్రాయెల్ భావిస్తోందన్నారు. అద్నాన్ అబు ‘దేశాభిమాని’ పత్రికా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపిన ముఖ్యాంశాలు…
పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయెల్ సైన్యం దారుణమైన దాడులకు తెగబడుతోంది. అయితే అక్టోబర్ 7న ఇజ్రాయెల్ సరిహద్దుల్లో ‘హమాస్’ జరిపిన దాడికి ప్రతీకారంగా దీనిని అభివర్ణిస్తున్నారు. ఇజ్రాయెల్, దాని మద్దతుదారులు చేస్తున్న ఈ వాదనను మీరెలా చూస్తారు?
ఈ క్షణం వరకు పాలస్తీనా ప్రజలపై జరుగుతున్న దాడులను ఆపలేకపోయారు. ఇజ్రాయెల్ చరిత్రలో ఇప్పుడున్నది అత్యంత తీవ్రవాద ప్రభుత్వం. ఇలాంటి యుద్ధ నేరాలు చేయడానికి ఎవరి సహాయం అవసరం లేదు. కానీ ఇజ్రా యెల్‌కు అమెరికా ఆయుధాలు అందిస్తోంది. అమెరికా విదేశాంగ మంత్రి ఆ దేశం వెళ్లారు. అమెరికా విమాన వాహక నౌకలు ఇజ్రాయెల్ సరిహద్దులో ఉన్నాయి. ఇజ్రాయెల్ ఇప్పుడు స్వీయదహనంలో ఉంది. ఇజ్రాయెల్‌ను సృష్టిం చింది బ్రిటన్. అందుకు అమెరికా, ఫ్రాన్స్ వంటివి మద్దతు పలి కాయి. ఇజ్రా యెల్ కేవలం సైనిక శక్తిపై ఆధారపడిన దేశం. అమెరికాకు ఇజ్రాయెల్ అత్యు త్తమ పెట్టుబడి అని అధ్యక్షుడు జోబైడెన్ అన్నారు. యూదులు ఆ విధంగానే చూస్తారు. ఇజ్రాయెల్ ఏర్పడి ఉండకపోతే, తానే ఇజ్రాయెల్‌ను ఏర్పాటు చేసి ఉండేవాడినని కూడా బైడెన్ చెప్పాడు. యుద్ధాలలో ఇజ్రాయెల్ ప్రమేయం కూడా బైడెన్‌కు తెలుసు. ‘మాతృభూమి’ అనే అబద్ధం ఆధారంగా సృష్టించ బడిన ఇజ్రాయెల్ ఇప్పుడు పాలస్తీనియన్లను పొట్టన పెట్టుకుంటోంది. ఇజ్రా యెల్‌కు జన్మనిచ్చిన వారు దీనిని అడ్డుకునేందుకు ఎలాంటి ప్రయత్నమూ చేయడం లేదు.
అయితే ఇతర దేశాలు పాలస్తీనాకు మద్దతిస్తున్నాయా? ఉదాహరణకు లాటిన్ అమెరికా దేశాలు…?!
అవును, లాటిన్ అమెరికా దేశాలు మాకు మద్దతు ఇస్తున్నాయి. చైనా, గల్ఫ్ దేశాల మద్దతు కూడా వుంది. యూరప్ నుండి కూడా అనేక దేశాల మద్దతు ఉంది.
ప్రస్తుత పరిస్థితికి త్వరలో పరిష్కారం లభిస్తుందన్న ఆశ ఉందా…
గాజా ప్రజలు చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నారు. ఇజ్రాయెల్ యుద్ధ మంత్రి గాజాపై దిగ్బంధనాన్ని ప్రకటించాడు. వారికి ఆహారం, నీరు, విద్యుత్, మందు లు, ఇంధనం నిరాకరించబడ్డాయి. పాలస్తీనా ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నా రు. వారి భవనాలపై ఇజ్రాయెల్ బాంబులు వేస్తోంది. 10 లక్షలమంది ప్రజ లను ఉత్తరం నుండి దక్షిణ గాజాకు తరలించాలని ఆదేశించింది. అంతేకా కుండా, ఇజ్రాయెల్ యుద్ధ మంత్రి గాజాలోని 22 లక్షలమంది పాలస్తీనీయు లను ‘మానవ మృగాలు’ అన్నాడు. ప్రజాస్వామ్య దేశంలో ఒక మంత్రి ఇలా మాట్లాడతాడా? ఫాసిస్టు పాలనా ప్రతినిధి మాత్రమే ఇలా మాట్లాడతాడు. ఈ విధమైన దండయాత్రను మనం చవిచూస్తున్నాం. వారికి శాంతి అక్కర్లేదు. వారికి భూమి మాత్రమే కావాలి. 6 కోట్ల మంది పాలస్తీనా ప్రజలు ఎప్పటికీ తమ ఆక్రమణలోనే ఉండాలని వారు కోరుకుంటున్నారు.
హమాస్ దాడికి ఎంచుకున్న సమయానికి సంబంధించి కొన్ని వర్గాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇజ్రాయెల్ ప్రధాని రాజకీయ అస్థిరతను ఎదుర్కొంటున్న సమయంలో ఇది మొదలవడాన్ని ఎలా చూస్తారు?
హమాస్ ఎదురుదాడి ప్రారంభించింది, దాడి కాదు. గత డిసెంబర్ నుంచి ఇజ్రా యెల్ నిరంతరం దాడులు చేస్తోంది. ఒక్క వెస్ట్ బ్యాంక్‌లోనే 260 మంది చని పోయారు. అల్ అక్సా మసీదుపై ప్రతి రోజూ దాడులు జరుగుతున్నాయి. అల్ -అక్సా మసీదులో పాలస్తీనా మహిళలతో ఇజ్రాయెల్ సైనికులు ఎలా ప్రవ ర్తించారో అందరూ చూశారు. పాలస్తీనా భూమి ప్రతి రోజూ ఆక్రమణకు గుర వుతోంది. పాలస్తీనియన్లు ప్రతి రాత్రి అరెస్టు చేయబడుతున్నారు. ఇజ్రా యెల్ జైళ్లలో దాదాపు 5,000 మంది పాలస్తీనా ఖైదీలు ఉన్నారు. ఈ పరిస్థితి ఒక్క గాజాలోనే కాదు. ఇది వెస్ట్ బ్యాంక్‌లోనూ వున్నది. పాలస్తీనా ప్రజలు ప్రపం చంలోనే అత్యంత దారుణమైన దురాక్రమణను ఎదుర్కొంటున్నారు. దురాక్ర మణదారులకు పశ్చిమ దేశాల మద్దతు ఉంది. మాకు ఔదార్యం కాదు, డబ్బు కాదు, సమస్యకు రాజకీయ పరిష్కారం కావాలి. పాలస్తీనా ప్రజల స్వయం నిర్ణయాధికారం కాపాడబడాలి. మన పిల్లలు ఇతర పిల్లల్లాగే ఆడుకుంటూ పెరిగే అవకాశం ఉండాలి. అంతేగాని వారు ప్రతిరోజూ దాడుల్లో చనిపోకూ డదు. అంతర్జాతీయ సమాజం తన బాధ్యతను నిర్వర్తించాలి. గాజాలోని 22 లక్షలమంది ప్రజలపై దిగ్బంధనానికి ముగింపు పలకాలి. వారికి నిత్యావ సరాలు అందాలి. శాంతి ప్రక్రియను ప్రారంభించకుండా, పాలస్తీనా ప్రజలకు న్యాయం చేకూర్చ కుండా అక్కడ శాంతి సాధ్యం కాదు. పాలస్తీనా అంశంపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి, జనరల్ అసెంబ్లీలో ఇప్పటిదాకా 800 తీర్మానాలు ఆమోదించారు. వీటిలో ఒక్క తీర్మానాన్నైనా అమలు చేయమని ఇజ్రాయెల్‌ను ఎవరూ అడగలేదు. శాంతి ప్రక్రియ చేపడతారని ఆశిస్తున్నాం. ఈ ప్రాంతంలో ఇదే చివరి యుద్ధం కావాలని ఆశిస్తున్నాం. ఇజ్రాయెల్‌ది వర్ణవివక్ష పాలనని ప్రకటించడానికి పశ్చిమదేశాలు సిద్ధంగా ఉండాలి. ఈ ప్రయోగం దక్షిణా ఫ్రికాలో విజయం సాధించింది.
భారతదేశం నుండి పాలస్తీనాకు లభిస్తున్న మద్దతుతో మీరు సంతప్తి చెందారా…?
భారతదేశంతో మాకు మంచి సంబంధాలు ఉన్నాయి. భారత్‌కు మంచి అవకాశం లభించింది. గాజా సరిహద్దును తెరిచి, నిత్యావసర వస్తువుల పంపిణీకి అవస రమైన పరిస్థితులను కల్పించాలని ఇజ్రాయెల్‌ను భారత్ కోరాలి. ఇజ్రాయెల్ చేస్తున్నది యుద్ధ నేరం. గాజాలోని ఆసుపత్రులను నాశనం చేసే ఎత్తుగడ కూడా ఉంది. ఈ పరిస్థితికి ముగింపు పలకాలి. ఇజ్రాయెల్‌లో ప్రాణనష్టానికి సంబంధించి అతిశయోక్తితో కూడిన వార్తలు వస్తున్నాయి. ఎక్కడైనా సరే మర ణం బాధాకరమైనది. అయితే ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం నుంచి అసత్య ప్రచారం జరుగుతోంది. ఇజ్రాయెల్ పిల్లలను హమాస్ చంపిందనే అబద్ధపు వార్తకు సంబంధించి సిఎన్‌ఎన్ రిపోర్టర్ క్షమాపణలు చెప్పాల్సిన పరిస్థితి.