– ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ విబి. కమలాసన్ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
జన్వాడ ఫాంహౌస్ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని తెలంగాణ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ విబి. కమలాసన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం రాత్రి సైబరాబాద్ పోలీసులతో కలిసి ఎక్సైజ్ శాఖ సంయుక్తంగా జన్వాడా వద్ద రాజ్ పాకాలకు చెందిన ఫామ్‌హౌస్‌పై దాడి చేయగా 22 మంది పురుషులు, 18 మంది మహిళలు లిక్కర్ పార్టీలో ఉన్నట్టు గుర్తించినట్టు తెలిపారు. 7.1 లీటర్ల స్వదేశీ మద్యం, 0.450 (ఎంఎల్) నాన్‌పేయిట్ లిక్కర్, 11 ఐఎంఎఫ్‌ఎల్ బాటిళ్లు, 11 కేఎఫ్ అల్ట్రా బీర్లను ఈ సందర్భంగా స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొన్నారు. అబ్కారీ శాఖ నుంచి ఎలాంటి అనుమతి లేకుండా ఈవెంట్ నిర్వహించినట్టు తెలిపారు. తెలంగాణ అబ్కారి యాక్ట్1968 కింద చేవెళ్ల ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో కేసు నమోదు చేసినట్టు పేర్కొన్నారు. తదుపరి విచారణలో పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయని తెలిపారు.