మండలంలోని రెడ్డి పేట గ్రామంలో ఈ నెల 9,10,11 తేదీల్లో గంగమ్మ ఆలయ ప్రారంభోత్సవంతో పాటు, ఉత్సవాలు నిర్వహించనున్నందున ఆదివారం రెడ్డిపేట గంగపుత్ర సంఘ సభ్యులు, మాజీ జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి కి ఆహ్వాన పత్రిక అందజేశారు. కార్యక్రమంలో గంగపుత్ర సంఘం సభ్యులు చంద్రబాబు, గణేష్, రమేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.