నీట్ -2024 ప్రవేశ పరీక్షలో జరిగిన అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి

– నీట్ ప్రవేశ పరీక్షను మరల నిర్వహించి విద్యార్థులకు న్యాయం చేయాలి
– కాకతీయ యూనివర్సిటీ  విద్యార్థి నాయకుడు కొత్తూరి రోహిత్ డిమాండ్
నవతెలంగాణ – తాడ్వాయి 
నీట్- 2024 ప్రవేశ పరీక్షల్లో జరిగిన అక్రమాలపై సిటింగ్ జడ్జ్ తో విచారణ జరిపించాలని, నీట్ ప్రవేశ పరీక్షలు మల్ల నిర్వహించి విద్యార్థులకు న్యాయం చేయాలని కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు కొత్తూరు రోహిత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ నీట్ యూజీ ప్రవేశ పరీక్ష ఫలితాలు ఈనెల 4వ తేదీన విడుదలైన విషయం మనకు తెలిసిందే. ఈ పరీక్ష ఫలితాలు నోటిఫికేషన్ ప్రకారం ఈనెల 14 కాకుండా ఎన్నికల ఫలితాలు విడుదలైన రోజు ఈనెల 4న అట్టహసంగా విడుదల చేయడం అనేక అనుమానాలకు దారితిస్తున్నాయని విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారని మండిపడ్డారు. నీట్ యూజీ ప్రవేశ పరీక్షలో ఒక సమాధానంకు నాలుగు మార్కులు, ఒక తప్పు సమాధానానికి నాలుగు మార్కులతో పాటు ఒక్క మార్కు నెగటివ్ ఉంటుంది. కానీ, ఇందులో విద్యార్థులకు చిత్ర విచిత్రమైన మార్కులు వచ్చాయాని కొంత మంది విద్యార్థులకు 718, 719 మార్కులు ఎలా వచ్చాయాని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అడుగుతుంటే యూజీసీ మాత్రం గ్రేస్ మార్కులు కలిపామని చేతులు ధూళిపెసుకునే ప్రయత్నం చేస్తూ దాటివేసే ధోరణిలో ఉందని ఆరోపించారు.  గ్రేస్ మార్కులు కలపాలని నీట్ యూజీ నియమ నిబంధనలలో లేకున్న ఎలా కలిపారని వారు ధ్వజమెత్తారు.
ఇప్పటికే విడుదలైన పరీక్ష ఫలితాలలో ఒకే పరీక్ష కేంద్రంలో రాసిన విద్యార్థిలకు వరుసగా ఒకే విధంగా మార్కులు రావడం ప్రవేశ పరీక్ష లోపాలను ఎత్తిచూపుతుందన్నారు. ఒకపక్క ప్రవేశ పరీక్ష పేపర్ లికేజీ అయిందని వస్తున్న వార్తలపై కేంద్ర ప్రభుత్వం అలాగే ఎన్టీఎ విచారణ చేపట్టకుండా,విద్యార్థులకు అన్యాయం చేస్తుందని, అలాగే కోన్ని చోట్ల జరిగిన మాల్ ప్రాక్టీస్ వలన చదువుకునే విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని వారు వాపోయారు. రాష్ట్ర స్థాయిలలో జరిగే ప్రవేశ పరీక్షలలో అవినీతి జరుగుతుందిని, ఈ అవినీతిని అరికట్టాలనే ఉద్దేశంతో దేశ వ్యాప్తంగా ఒకటే పరీక్ష ఉండటం వలన అవినీతిని అరికట్టవచ్చనే ఉద్దేశంతో చేపట్టిన నీట్ యూజీ పరీక్షలలో సైతం అవినీతి, అక్రమాలు జరగడం ప్రభుత్వల చేతకానితనానికి నిదర్శనం అని, అలాగే నీట్ ప్రవేశ పరీక్షను కేవలం హింది, ఇంగ్లీష్ లలో నిర్వహించడం వలన దక్షణాది రాష్ట్రాల విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. నీట్ యూజీ పరీక్షను స్థానిక బాషలలో కూడా నిర్వహించి దక్షణాది రాష్ట్రాల ప్రజలకు న్యాయం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. అక్రమాలపై వస్తున్న ఆరోపణలను పరిగణలోకి తీసుకుని సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి విద్యార్థులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేసారు.