– అయోమయంలో ప్రజలు
నవతెలంగాణ- మల్హర్ రావు
గత మూడు రోజులుగా ఇండ్లకు తగిలేలా జెట్ విమానం ఆకాశంలో చక్కర్లు కొడుతోంది. దీంతో మండల ప్రజలు అయోమయానికి గురవుతున్నారు. అసలు విమానం ఇంత కింది నుంచి అది ఇళ్లకు తగిలేలా ఎందుకు చక్కర్లు కొడుతోంది. అనే సందిగ్ధంలో ప్రజలు పడితే, పిల్లలు అచ్చర్యాని గురైతే, యువత మాత్రం జెట్ విమానాన్ని సరదాగా వీడియోలు, ఫొటోలు తీస్తూ ఎంహాయ్ చేస్తున్నారు. భూబాగానికి అత్యంత సమీపం నుంచి ఎందుకు వెళుతున్నాయి ఎక్కడి వెళుతున్నాయి. అంటూ గ్రామాల్లో చర్చనీయంగా మారింతే మండలంలోని తాడిచెర్ల కొందరు మాత్రం సింగరేణి షాట్ లైట్ సర్వే అంటున్నారు. అసలు ఈ విమానంపై అధికారులకే పూర్తి సమాచారం లేనట్లుగా తెలుస్తోంది. ఆకాశంలో అందనంత ఎత్తిలో విమానం ప్రయాణిస్తేనే కనిపించే వరకు చూసే ప్రజలు పల్లెల్లో అత్యంత సమీపంలో జెట్ విమానాలు ప్రయానిస్తే ఆ ఆనందం మరోలా ఉంటుందని పలువురు అంటున్నారు.
|