
మండలం లోని గిరిజన బాలుర గురుకుల హస్టల్ ను జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆహార నాణ్యతను, విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు, వసతి గృహ పరిసరాల్లో పారిశుధ్యం, మరుగుదొడ్లు, వంటశాలను పరిశీలించారు. భోజనాన్ని రుచి చూశారు. హాస్టల్ నిర్వహణపై విద్యార్థులతో మాట్లాడి సంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే ప్రభుత్వం ఇస్తున్న కాస్మెటిక్స్ ఛార్జీలు, యూనిఫాం, దుప్పట్లు, ట్రంక్ పెట్టె తదితర వస్తువులు ఇచ్చారా? లేదా? అని ఆరా తీశారు. విద్యార్థులు హాస్టల్లో ఎలాంటి సమస్య ఉన్నా మండల స్థాయి అధికారులతో పాటు తన దృష్టికి తేవాలని, ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని శ్రద్ధగా చదవాలని సూచించారు.ఈ కార్యక్రమం లో తహసీల్దార్ సరోజ పావని, మండల ప్రత్యేక అధికారరి రాజ్ కుమార్, ఎంపీడీఓ సుధీర్ కుమార్ ఉన్నారు.