నవతెలంగాణ – జక్రాన్ పల్లి
దొంగతనం కేసులో ఆర్మూర్ జడ్జి వేముల దీప్తి నిందితుడికి ఐదు నెలల జైలు శిక్ష విధించినట్లు జక్రాన్ పల్లి ఎస్సై తిరుపతి తెలిపారు. వివరాల్లోకి వెళితే జక్రంపల్లి తండాలో ఆగస్టు నెలలో బాణావత్ నరేష్ అను వ్యక్తి ఇంట్లో దొంగతనానికి పాల్పడిన పడకల్ గ్రామానికి చెందిన కోనేటి నరేష్ అనే వ్యక్తికి బుధవారం ఆర్మూర్ ప్రథమ శ్రేణి న్యాయమూర్తి అయిన వేముల దీప్తి ఐదు నెలల జైలు శిక్ష విధించినారని జక్రాన్ పల్లి ఎస్సై తిరుపతి తెలిపారు.