– గిరిజన తండాల వ్యక్తుల పేర్లతో గోశాల సంఘాలు ఏర్పాటు..
– కబేలాలకు చేరుతున్నాయని భక్తుల అనుమానాలు..
– గోశాల సంఘాల పై నిఘా కరువు..
– భక్తుల మనోభావాలను కాపాడాలి..
నవతెలంగాణ – వేములవాడ
దేశంలోనే ఎక్కడ ఏ దేవాలయంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలోని వేములవాడ రాజన్న క్షేత్రంలో ఒక ప్రత్యేకత ఉంది, అది ఆ పరమశివుడి వాహనమైన నంది (వృషభం) శివుని ప్రధమ గణాల్లో మొదటిదైన నందిని పూజించడం ఈ క్షేత్రం యొక్క ప్రత్యేకత.. నందివాహనుడైన ముక్కోటి శంకరుని కోడె ముక్కుల రాజన్నగా భక్తులు ఆరాధిస్తారు.. కొత్తగా పెళ్లయిన జంట రాజన్నను దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటే, వచ్చే ఏడాది వరకు కోడె లాంటి కొడుకు పుడతాడు అని భక్తుల విశ్వాసం.. రైతులు వ్యవసాయానికి ఎంతో సహాయ సహకారకంగా ఉండే ,ఇంట్లో ప్రధాన సమస్యలు తీరితే రాజన్నకు కోడెను సమర్పించుకుంటామని మొక్కుకుంటారు,కోడె ముక్కలు చెల్లించుకోవడం తెలంగాణ ప్రజల ఆనవాయితీ..
గిరిజన తండాల వ్యక్తుల పేర్లతో గోశాల సంఘాలు ఏర్పాటు..
కొన్ని సంవత్సరాలగా గోశాలలా నిర్వాహకులకు నెలల్లో మూడు నాలుగు సార్లు పదుల సంఖ్యలో రాజన్న భక్తులు కోడెమొక్కులను చెల్లించుకున్న మొక్కుబడి కింద వచ్చిన కోడెముక్కులను గోశాల నిర్వాహకులు వాటి పోషణార్థమై, గోశాల నిర్వాహకులకు దేవాలయ అధికారులు అందజేస్తారు.. నల్లగొండ, వరంగల్, జనగం, ఆలేరు, హనుమకొండ ఇతర జిల్లాల లోని గిరిజన తండాల వ్యక్తుల పేర్లతో గోశాలలకు నామకరణం చేసి వారి పేరుతోగోశాల పేరుతో ఓ వ్యక్తి ఏర్పాటు చేసి వాటి మాటన గుట్టుగా రాజన్న కోడెలను కబేలాలకు నిర్వాహకులకు చేరవేస్తున్నట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో రాజన్న మొక్కుబడి కింద వచ్చిన కోడెలను నేరుగా నెలలో ఒకరోజు రైతులకు పాస్ బుక్కులు తీసుకొని వస్తే వ్యవసాయానికి సహాయకంగా ఉంటుందని దేవాలయ అధికారులు కోడెలను రైతులకు ఇచ్చేవారు. వాళ్లలో కొందరు స్వార్ధపరులు రైతుల పాసుబుక్కులను చూపి రాజన్న కోడెలను దొంగ మార్గాన కబేలలా నిర్వాహకులకు అమ్మి క్యాష్ చేసుకుంటున్నారని తెలిసి రావడంతో అలా ఇవ్వడం నిలిపివేశారు.
నల్లగొండ, వరంగల్, జనగం, ఆలేరు, హనుమకొండ ఇతర జిల్లాల లోని గిరిజన తండాల వ్యక్తుల పేర్లతో గోశాలలకునామకరణం చేసి వారి పేరుతో గుజరాత్ కు చెందిన ఓ వ్యక్తి తెర వెనకాల నడిపిస్తున్నాడు అని గుసగుసలు వినిపిస్తున్నాయి..గుజరాత్ చెందిన వ్యక్తి చెబితే ఈ గోశాల నిర్వాహకులమని అని వెళ్లే వ్యక్తికి దేవాలయ అధికారులు కోడెలను అప్పజెప్తారు, అలా తెచ్చిన 20 కోడెలను తెచ్చిన వ్యక్తికి సుమారుగా 20,000 నుండి 30 వేల రూపాయల వరకు చెల్లిస్తాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
గోశాలలా ట్రస్ట్ మాటున చీకటి వ్యాపారం..
హిందువులు ఎంతో భక్తిశ్రద్ధలతో పూజించే శివుడి వాహనమైన నందిని (వృషభం) కొందరు స్వార్ధపరులు దేవాలయ అధికారులతో కలిసి ధనార్జనే ధ్యేయంగా చాటు మాటున గోశాల నిర్వాహకులు 100 కిలోమీటర్ల నుండి రాజన్న కోడెల కోసం డీసీఎం కిరాయికి తీసుకువచ్చి 20 కోడెలను తరలించి తీసుకువెళ్తే సుమారుగా 15,000 రూపాయల వరకు ఖర్చవుతుంది.రాజన్న ఆలయ అధికారులు వాటి పోషణ, సంరక్షణ కోసం వారికి ఉచితంగా ఇస్తున్నామని చెబుతున్నారు.. గోశాల నిర్వాహకులు ఇంత ఖర్చు పెట్టి రైతులకు ఉచితంగానే ఇస్తున్నారా..? ఇందులో గోశాల నిర్వాహలకు వచ్చే లాభం ఏమిటి..? గోశాల నిర్వాహకులకు దాతలు ఇస్తే పచ్చి గడ్డికి ,దాన కు, గోశాల మెయింటెనెన్స్ కు, పశువుల వైద్య ఖర్చులకు మాత్రమే దాతలు ఆర్థిక సహాయం చేస్తారు. ఇప్పుడు ఉన్న ఆధునిక యంత్రాంగంలో నేడు వ్యవసాయం యంత్రాలతోనే చేస్తున్నారు, అప్పట్లో ఆధునిక యంత్రాలు లేని సమయంలో ఎడ్లతోనే నాగలితో దుక్కి దున్ని, గురు రోప్పి పంట పొలాలకు ఎడ్ల బండి సహాయంతో ఎరువును తరలించేవారు,ఇప్పుడు అట్టి అవకాశం లేదు వందల ఒకటి, రెండు శాతం మాత్రమే ఎడ్లతో వ్యవసాయం చేస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు వ్యవసాయం చేసే రైతు వచ్చి రాజన్న కోడెలు ,గోశాల నిర్వాహకులు ద్వారా మేము లబ్ధి పొందామని వార్తలు ఎక్కడ కూడా వినపడలేదు..
రాష్ట్రంలో ఎక్కడ ఒకచోట కబేలాలకు తరలిస్తున్న మూగజీవాలు అనే వార్తలు వినబడుతూనే ఉన్నాయి, మనం చూస్తూనే ఉన్నాం.. నిజంగా రాజన్న కోడెలు గోశాలలో వాటికి పోషణ అందుతుందా..? గోశాలలో సంరక్ష లో ఉన్నాయ అసలు గోశాలల పేర్లతో నిర్వహిస్తున్న వారు వాటి సంరక్షణ సరిగా చూస్తున్నారా ఇక్కడి రాజన్న దేవాలయంలో అధికారులు భక్తులు సమర్పించిన కోడెలు గోశాలలో సురక్షితంగా ఉన్నాయని పర్యవేక్షించిన దాఖలాలు లేవు. గోశాల నిర్వాహకులమని వచ్చేవారు అసలైన గోశాల నిర్వాహకుల అని విచారణ చేసిన దాఖలాలు లేవని విమర్శలు వినిపిస్తున్నాయి.
గోశాలలా ట్రస్ట్ లపై నిఘా కరువు..
పేదల విలవేల్పుగా.. పేదల దేవుడిగా, రాజన్నగా పూజలు అందుకుంటున్న రాజన్న క్షేత్రం.. కోడె ముక్కుల ద్వారా ప్రతి ఏటా సుమారుగా 20 కోట్ల నుండి 30 కోట్ల వరకు రాజన్న ఖజానాలో జమవుతుంది. ఇంత ఆదాయం వస్తున్న రాజన్న కోడెల పై అధికారుల పర్యవేక్షణ శూన్యం, నిత్యం కోడెమొక్కుల రాజన్నగా పిలువబడే రాజన్న కోడెల సంరక్షణ కరువైందని భక్తులు ఆరోపిస్తున్నారు. గోశాల పేర్లతో కొంతమంది కబేలాలకు నిర్వాహలకు అమ్మేస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. “రాజన్న కోడెలు భద్రమైన..?”గోశాల నిర్వాహకులు గిరిజన తండాల పేర్లతో గోశాలను ఏర్పాటు చేసి ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై తిరగబడడం కేసులు పెట్టించడం బెదిరింపులకు పాల్పడడం లాంటి జరుగుతున్నాయి.. ఇప్పటికైనా దేవాదాయ ధర్మాదాయ అధికారులు స్పందించి రాజన్న మొక్కుబడి కింద వచ్చే కోడెలను పోషణ, సంరక్షణ దేవాలయం వారేచూడాలని కోరుతున్నారు.. గోశాల నిర్వాహకులపై వస్తున్న ఆరోపణపై దేవాలయ అధికారులు విచారణ చేపట్టి నిజా నిజాలను వెలికి తీయాలని భక్తులు కోరుతున్నారు.