ఏటా సంక్రాంతి పండగ సందర్భంగా ఎగురవేసే గాలి పటాల కారణంగా ఎక్కడో ఓకచోట విషాద ఘటనలు జరుగుతున్నాయి. పండగ ఆహ్లాదకర వాతావరణంలో అందరూ కలిసి సంతోషంగా జరుపుకోవాల్సి ఉండగా.. తెలిసి తెలియని వయస్సులో చిన్న పిల్లలు ప్రమాదాల బారిన పడుతున్నారు.
అప్రమత్తత అవసరం..
పట్టణాల్లో మైదాన ప్రాంతాలు లేకపోవడంతో బహుక అంతస్తుల భవనం పైకప్పుల నుంచి పతంగులు ఎగురవేస్తారు. పిట్ట గోడలు లేని పైకప్పుల అంచుల వద్ద పతంగులు ఎగురవేసే క్రమంలో అపాయాలు పొంచి ఉంటాయి.గాలి పటాలు విద్యుత్ స్తంభాలు, లైన్లపై,సెల్ ఫోన్ టవర్లపై పడిన సందర్భాల్లో వాటిని దక్కించుకునే ప్రయత్నంలో విద్యుత్గథానికి గురైయ్యే అవకాశాలు ఉన్నాయి. దీనికి తోడుగా గాలిలో ఎగురుతున్న పతంగిని చూసుతు భవనం పైన కాలు జారిపడే అవకాశాలు ఉన్నాయి. పతంగిని ఎగురవేసేందుకు వినియోగించే నిషేధిత దారం ప్రమాదకరంగా మారుతోంది. ఎగురవేసే వారి చేతి వేళ్ళు తెగుతాయి. పైగా రహదారులపై వెళుతున్న వారి మెడకు బిగుసుకపోయే గొంతువద్ద గాయలయ్యే అవకాశాలు ఉన్నాయి.