
లక్ష డప్పుల వెయ్యి గొంతుల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి శంకర్ తెలిపారు. శనివారం పట్టణ కేంద్రంలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈనెల ఏడవ తేదీ నాడు హైదరాబాదులో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమానికి ప్రతి ఒక్క ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరావాలని మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమానికి తరలివచ్చి ఉద్యమాన్ని విజయవంతం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు లక్ష్మణ్, స్వామి, బిక్షపతి ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు రాజు, ప్రభాకర్, జీవన్, దయానంద్, తదితరులు పాల్గొన్నారు.